Home > తెలంగాణ > Telangana Elections 2023 > Komatireddy : కేటీఆర్ పిట్ట కథలు చెప్పడంలో దిట్ట: కోమటి రెడ్డి

Komatireddy : కేటీఆర్ పిట్ట కథలు చెప్పడంలో దిట్ట: కోమటి రెడ్డి

Komatireddy : కేటీఆర్ పిట్ట కథలు చెప్పడంలో దిట్ట: కోమటి రెడ్డి
X

కాంగ్రెస్ సీనియర్ నేత కోమటి రెడ్డి వెంకట రెడ్డి మంత్రి కేటీఆర్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేటీఆర్ పిట్ట కథలు చెప్పడంలో దిట్ట అని అన్నారు. రానున్న ఎన్నికల తర్వాత కేసీఆర్ కుటుంబం ప్రగతి భవన్ ను ఖాళీ చేస్తుందని చెప్పుకొచ్చారు. నార్కట్ పల్లి వివేర హోటల్ లో జరిగిన కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న కోమటి రెడ్డి.. బీఆర్ఎస్ పార్టీ తీరుపు మండిపడ్డారు. ఈ సందర్భంగా వివిధ పార్టీల నుంచి వచ్చిన పలువురు నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ ప్రకటించిన గ్యారెంటీలను.. బీఆర్ఎస్ ప్రభుత్వం పేర్లు మార్చి, అమౌంట్ పెంచి తిరిగి ప్రకటించిందని ఆరోపించారు.

తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ పాలనలో విసిగిపోయిన తెలంగాణ ప్రజలు.. ఆ పార్టీ మేనిఫెస్టోను నమ్మె పరిస్థితిలో లేరని అన్నారు. ఈ తొమ్మిదేళ్లలో ప్రజల నుంచి దోచుకున్న సొమ్మును.. ఎన్నికల్లో ఖర్చు చేస్తుందని చెప్పారు. ఎన్నికల వేళ బీఆర్ఎస్ ఇచ్చిన డబ్బును తప్పకుండా తీసుకుని.. ఓటు మాత్రం కాంగ్రెస్ పార్టీకి వేయాలని అన్నారు. వేముల వీరేశం నకిరేకల్ లో 60 వేల మెజారిటీతో గెలిపించాలని కోరారు. వీరేశం కోసం, కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. ప్రకటించిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు.




Updated : 16 Oct 2023 12:56 PM GMT
Tags:    
Next Story
Share it
Top