Home > తెలంగాణ > Telangana Elections 2023 > Komatireddy Rajagopal Reddy : బీఆర్ఎస్ హయాంలో ప్రజాస్వామ్యం ఖూనీ: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Komatireddy Rajagopal Reddy : బీఆర్ఎస్ హయాంలో ప్రజాస్వామ్యం ఖూనీ: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Kiran | 3 Dec 2023 4:14 PM IST
X
X
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ విజయ దుందుబి మోగించడంపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంతోషం వ్యక్తంచేశారు. మునుగోడులో విజయం సాధించిన ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల నిర్ణయంతో డిసెంబర్ 3 చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు.
ఆత్మగౌరవం కోసం పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణను ఓ కుటుంబం దోచుకుందని రాజగోపాల్ ఆరోపించారు. అందుకే అవినీతిలో కూరుకుపోయిన బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు చరమగీతం పాడారని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ కు విజయం కట్టబెట్టి సోనియా గాంధీకి గిఫ్ట్ ఇచ్చిన తెలంగాణ ప్రజలకు హృదయపూర్వక అభినందనలు చెప్పారు. తన ఆశయం, లక్ష్యం నెరవేరినందుకు సంతోషంగా ఉందని చెప్పారు.
Updated : 3 Dec 2023 4:14 PM IST
Tags: Telangana news telugu news election results live updates assembly election 2023 telangana election 2023 results 2023 congress party munugodu komatireddy rajagopal reddy corrupt government december 3 sonia gandhi
Next Story
© 2017 - 2018 Copyright Mictv news. All Rights reserved.
Designed by Hocalwire