Komatireddy Raj Gopal Reddy: బీజేపీకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా
X
బీజేపీకి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేశారు. ఈనెల 27న రాహుల్ గాంధీ సమక్షంలో తిరిగి కాంగ్రెస్‌లోకి చేరనున్నారు. కాంగ్రెస్ తరపున మునుగోడు నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బరిలోకి దిగనున్నట్లు సమాచారం. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. ఏడాదిన్నర క్రితం తెలంగాణలో అధికార బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఎదిగిన బిజెపి, ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో కొంత డీలా పడిందని తెలిపారు. ఇప్పుడు తెలంగాణ ప్రజలు అధికార బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ను భావిస్తున్నారని తాను కూడా తెలంగాణ ప్రజల ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
నాడు కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరినా, నేడు బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి మారుతున్నా తన లక్ష్యం మాత్రం ఒకటేనన్నారు. కేసిఆర్ కుటుంబ అవినీతి, అరాచక, అప్రజాస్వామిక పాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయడమేనని తెలిపారు. తాను ఏనాడూ పదవుల కోసం ఆరాటపడలేదని, తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణ కోసమే తపన పడినట్లు చెప్పారు. నియంత కెసిఆర్ పాలనను అంతమొందించేందుకు కాంగ్రెస్ లో చేరుతున్న తనను ఆదరించాలని రాష్ట్ర ప్రజలని కోరారు.