Komatireddy Rajagopal Reddy : 35mm సినిమా ఖతం.. ఇకపై 70mm సినిమా చూపిస్తా : కోమటిరెడ్డి
X
బీజేపీ 35mm సినిమా అయిపోయిందని.. ఇకపై కాంగ్రెస్ 70mm సినిమా చూపిస్తానని మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. తాను అమ్ముడుపోయే వ్యక్తిని కాదని.. నియోజకవర్గ ప్రజల కోసం కాంగ్రెస్ లోకి వచ్చినట్లు తెలిపారు. మునుగోడులో ఆయన కార్యకర్తల సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో 90 సీట్లతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమాను వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మునుగోడును మరింత అభివృద్ధి చేసుకుందామని రాజగోపాల్ రెడ్డి అన్నారు. కార్యకర్తలపై అధికార పార్టీ అక్రమ కేసులు పెడుతోందని.. వారికి తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అదేవిధంగా కార్యకర్తల మధ్య ఏమైన సమస్యలు ఉంటే నాలుగు గోడల మధ్య పరిష్కరించుకుందామని.. బహిరంగంగా గొడవలు పెట్టుకోవద్దని సూచించారు. తాను బీజేపీలో ఉన్నప్పుడు పార్టీ పరిస్థితిపై అమిత్ షాతో నిర్మోహమాటంగా మాట్లాడినట్లు గుర్తు చేశారు. కాంగ్రెస్ గెలుపు కోసం పార్టీ శ్రేణులు కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు.