Komatireddy Venkat Reddy : 24 గంటలు కరెంట్ నిరూపిస్తే.. ఈ ఎన్నికల్లో పోటీ చేయను.. కోమటి రెడ్డి
X
తెలంగాణలో రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరాపై అధికార, విపక్ష నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఎకరం భూమి నీళ్లు పారేందుకు గంట సమయం సరిపోతుందని.. చిన్న సన్న కారు రైతులకు మూడు నాలుగు గంటల కరెంట్ ఇస్తే సరిపోతుందని రేవంత్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై రియాక్ట్ అవుతూ.. కాంగ్రెస్ కావాలా? కరెంట్ కావాలో? తెలంగాణ రైతులు తేల్చుకోవాలని మంత్రి కేటీఆర్ రాష్ట్ర ప్రజలకు సూచిస్తున్నారు.
ఇదిలా ఉండగా మరోసారి 24 గంటల కరెంట్ పై మరో కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో 24 గంటల కరెంట్ కాదు.. కనీసం 8 గంటల విద్యుత్ కూడా రావడం లేదని అన్నారు. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ కు సవాల్ విసిరారు కోమటిరెడ్డి. 24 గంటల నిరంతర విద్యుత్ లేదని నిరూపిస్తే.. కేటీఆర్ రాజకీయాల నుంచి విరమించుకుంటారా అని ఛాలెంజ్ చేశారు.
నిరంతర విద్యుత్ ఇస్తున్నట్లు కేటీఆర్ నిరూపిస్తే.. తాను ఈ ఎన్నికల్లో పోటీ చేయనని, అసలు రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. అంతేకాదు.. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేసి గెలిపిస్తా అని ఛాలెంజ్ చేశారు. తెలంగాణ నిరంతర విద్యుత్ నిజమని నిరూపిస్తే.. సిరిసిల్లలో కరెంట్ తీగలు పట్టుకుంటానన్నారు.