Konda Surekha : మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొండా సురేఖ
X
రాష్ట్ర అటవీ, పర్యావరణ మరియు దేవాదాయ శాఖ మంత్రిగా కొండా సురేఖ ఆదివారం బాధ్యతలు చేపట్టారు. సచివాలయం నాలుగో అంతస్తులో ఉన్న కార్యాలయంలో (రూమ్ నెంబర్ 410) కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి దేవాదాయ, అటవీ శాఖల ఉన్నతాధికారులు, సిబ్బంది హాజరై స్వాగతం పలుకుతూ శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు 11మంది మంత్రులతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఈ క్రమంలో రాష్ట్ర సచివాలయంలో మంత్రులు వారి శాఖకు సంబంధించిన బాధ్యతలను చేపడుతున్నారు. ఇప్పటికే పలువురు మంత్రులు బాధ్యతలు చేపట్టి సంబందిత అధికారులతో రివ్యూలు కూడా నిర్వహించి సమాచారం తెలుసుకుంటున్నారు. తాజాగా ఆదివారం రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రిగా కొండా సురేఖ సచివాలయంలోని తన ఛాంబర్ లో బాధ్యతలు స్వీకరించారు. ఇక బీసీ సంక్షేమ, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం బాధ్యతలు చేపట్టనున్నారు.