Konda Vishweshwar Reddy : ‘టికెట్ ఇస్తేనే పార్టీతో.. లేదంటే..’ బీజేపీకి మరో షాక్ ఇవ్వనున్న సీనియర్ నేత
X
తెలంగాణ బీజేపీకి మరో బిగ్ షాక్ తగలనుందా? మరో కీలక నేత పార్టీకి గుడ్ బై చెప్పనున్నారా? అంటే అవును అనే సమాధానం వినిపిస్తుంది. నిన్న బీజేపీ సీనియర్ నేతలు వివేక్ వెంకటస్వామి, ఏనుగుల రాకేశ్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాజాగా వారి బాటలోనే కొండా విశ్వేశ్వర్ రెడ్డి నడుస్తున్నట్లు తెలుస్తుంది. తెలంగాణలో బీజేపీ, జనసేన పొత్తుపెట్టుకున్న విషయం తెలిసిందే. అదే విషయంలో శేరిలింగంపల్లి టికెట్ విషయంలో పంచాయితీ నడుస్తుంది.
పొత్తులో భాగంగా శేరిలింగంపల్లి టికెట్ గనుక జనసేనకు కేటాయిస్తే విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేసే అవకాశం ఉంది. ఆ నియోజక వర్గ టికెట్ ను బీజేపీకి చెందిన రవి యాదవ్ కు కేటాయించాలని విశ్వేశ్వర్ రెడ్డి చాలాకాలంగా పట్టుబడుతున్నారు. చేవెళ్ల పార్లమెంట పరిధిలో.. ఒక్క శేరిలింగంపల్లిలోనే 30శాతం ఓట్లు ఉండగా.. పార్లమెంటు ఎన్నికల్లో గెలవాలంటే ఈ నియోజకవర్గం కీలకం కానుంది. ఈ నేపథ్యంలో టికెట్ ఎవరికి కేటాయిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.