Harish Rao : హరీశ్ రావు స్పీడుకు బ్రేక్.. ఈసారి మెజార్టీలో టాప్ ఎవరంటే..?
X
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ముగిసింది. కాంగ్రెస్ పార్టీ విజయ ఢంకా మొగించింది. 65 స్థానాల్లో గెలిచి అధికారాన్ని చేపట్టింది. తెలంగాణ ఎన్నికల్లో మెజార్టీ అంటే గుర్తొచ్చేపేరు హరీశ్ రావుదే. ప్రతీసారి మెజార్టీ ఓట్లు గెలిచి చరిత్ర సృష్టిస్తుంటారు. కానీ ఈసారి ఆ ఘనత ఆయనకు దక్కలేదు. మెజార్టీ విషయంలో హరీశ్ రావు రెండో స్థానానికి పరిమితం అయ్యారు. అయితే ఈసారి అత్యధిక మెజార్టీ సాధించిన అభ్యర్థిగా కే.పి. వివేకానంద నిలిచారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరుపున పోటీ చేసిన వివేకానంద.. బీజేపీ అభ్యర్తి కూన శ్రీశైలం గౌడ్‌పై 85 వేల 576 ఓట్ల మెజార్టీ సాధించారు.
మొత్తంగా లక్షా 87 వేల 999 ఓట్లు వివేకానంద సాధించారు. రెండో స్థానంలో నిలిచిన కూన శ్రీశైలం.. లక్షా 2వేల 423 ఓట్లు సాధించారు. మూడో స్థానికి పరిమితమైన కాంగ్రెస్ అభ్యర్తి కొలను హన్మంత రెడ్డి లక్షా 15వందల 54 ఓట్లు సాధించారు. ఇక మెజార్టీకి పేరైన హరీశ్ రావు ఈసారి 82వేల 308 ఓట్లు మాత్రమే సాధించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పూజల హరికృష్ణ 23 వేల 206 ఓట్లు సాధించి రెండోస్థానంలో నిలిచారు. బీజేపీ అభ్యర్థి దూది శ్రీకాంత్ రెడ్డి 23 వేల 201 ఓట్లతో మూడో స్థానానికి పరిమితమయ్యారు. కాగా 2018 ఎలక్షన్స్ లో హరీశ్ రావు లక్షా 30 వేల ఓట్ల మెజార్టీ సాధించడం గమనార్హం.