Home > తెలంగాణ > Telangana Elections 2023 > KTR : కేసీఆర్‌ను సవాల్‌ చేయడమంటే.. పోచమ్మ గుడి ముందు పొట్టేలును కట్టేసినట్టే: కేటీఆర్

KTR : కేసీఆర్‌ను సవాల్‌ చేయడమంటే.. పోచమ్మ గుడి ముందు పొట్టేలును కట్టేసినట్టే: కేటీఆర్

KTR : కేసీఆర్‌ను సవాల్‌ చేయడమంటే.. పోచమ్మ గుడి ముందు పొట్టేలును కట్టేసినట్టే: కేటీఆర్
X

సీఎం కేసీఆర్‌ కొడంగల్‌కు రాకపోతే.. తానే కామారెడ్డిలో కేసీఆర్‌పై పోటీ చేసి ఓడిస్తనని పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి సవాల్ విసిరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ రేవంత్ కు స్ట్రాంగ్ కౌంటర్ వేశారు. కేసీఆర్‌ను సవాల్‌ చేయడమంటే.. పోచమ్మ గుడి ముందు పొట్టేలును కట్టేసినట్టే అని వార్నింగ్ ఇచ్చారు. కామారెడ్డి సమీపంలోని బిక్నూర్ లో నిర్వహించిన పార్టీ సమావేశంలో పాల్గొన్న కేటీఆర్.. కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నారని చెప్పగానే ప్రతిపక్ష పార్టీల ఫ్యూజులు ఎగిరిపోయాయని అన్నారు. ఉద్యమ సమయంలో తెలంగాణ బిడ్డలకు తుపాకీ ఎక్కుపెట్టిన రైఫిల్ రెడ్డి.. కేసీఆర్ ను ఓడిస్తాననడం హాస్యాస్పదం అన్నారు. కామారెడ్డి నియోజక వర్గ అభివృద్ధి కోసమే కేసీఆర్ ఇక్కడ పోటీ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు వస్తడంన్నట్లు.. కేసీఆర్ ఇప్పుడు కామారెడ్డికి వస్తున్నారని చెప్పారు. కేసీఆర్ తో పోటీ అంటే షబ్బీర్ అలీ భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ఎవరి ప్రలోభాలకు లొంగొద్దని, బీజేపీ ఇచ్చే పిప్పరమెంట్లు, చాక్లెట్లకు ఆశపడొద్దని కామారెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. బీజేపీ నాయకులు ఎమిచ్చినా, ఎంతిచ్చినా తీసుకోవాలని.. అవన్నీ గుజరాత్ దొంగలు ఎత్తుకెళ్లిన మన సొమ్మని ఆరోపించారు. ఎవరెంత డబ్బిచ్చినా ఓటు మాత్రం బీఆర్ఎస్ పార్టీకి వెయ్యాలని చెప్పుకొచ్చారు.




Updated : 2 Nov 2023 1:31 PM IST
Tags:    
Next Story
Share it
Top