Home > తెలంగాణ > Telangana Elections 2023 > KTR : కేటీఆర్తో భేటీ.. పల్లా - ముత్తిరెడ్డి మధ్య కుదిరిన సయోధ్య!

KTR : కేటీఆర్తో భేటీ.. పల్లా - ముత్తిరెడ్డి మధ్య కుదిరిన సయోధ్య!

KTR : కేటీఆర్తో భేటీ.. పల్లా - ముత్తిరెడ్డి మధ్య కుదిరిన సయోధ్య!
X

ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అవడంతో బీఆర్ఎస్ దూకుడు పెంచింది. అసంతృప్తులను బుజ్జగించడంతోపాటు పెండింగ్లో ఉన్న సీట్లపై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో జనగామ నియోజకవర్గ నేతలతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి సహా టికెట్ ఆశిస్తున్న మండల శ్రీరాములు, కిరణ్ కుమార్ గౌడ్లు ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ముత్తిరెడ్డి - పల్లా మధ్య సయోధ్య కుదిరినట్లు తెలుస్తోంది. జనగామలో పల్లాను గెలపించుకోవాలని కేటీఆర్ వారికి చెప్పినట్లు సమాచారం. పార్టీ కోసం కష్టపడేవారికి తప్పకుండా ఫలితం ఉంటుందని కేటీఆర్ వారితో స్పష్టం చేశారు.

కాగా జనగామ టికెట్ను బీఆర్ఎస్ పెండింగ్లో పెట్టింది. సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి కాకుండా పల్లా రాజేశ్వర్ రెడ్డికి టికెట్ ఇస్తారని ప్రచారం జరిగింది. దీంతో ముత్తిరెడ్డి పల్లాపై బహిరంగ ఆరోపణలు చేశారు. పల్లాకు టికెట్ ఇస్తే సహకరించేది లేదంటూ అప్పట్లో ఫైర్ అయ్యారు. ఈ క్రమంలో ముత్తిరెడ్డిని సీఎం కేసీఆర్ టీఎస్ఆర్టీసీ చైర్మన్గా నియమించారు. రెండు రోజుల క్రితం ఆయన బాధ్యతలు సైతం చేపట్టారు. దీంతో పల్లాకు టికెట్ ఫిక్స్ అయ్యిందనే వాదనలు బలపడ్డాయి. ఇవాళ కేటీఆర్తో సమావేశం నేపథ్యంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగామ నుంచి పోటీచేయడం ఖాయమైనట్లు తెలెస్తోంది.

బీఆర్ఎస్ ఇప్పటికే 115మందితో ఫస్ట్ లిస్ట్ ప్రకటించగా.. రెండో లిస్ట్ ప్రకటించేందుకు రెడీ అయ్యింది. జనగామ, నర్సాపూర్, నాంపల్లి, గోషామహల్ స్థానాలకు ఇవాళ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. అటు మల్కాజ్ గిరి స్థానానికి సైతం అభ్యర్థిని ప్రకటించనున్నారు. మైనంపల్లి హన్మంతరావు బీఆర్ఎస్కు రాజీనామా చేయడంతో ఆ స్థానం కూడా పెండింగ్లో ఉంది.

మంత్రి కేటీఆర్ ఈ 5 స్థానాలపై పార్టీ సీనియర్లతో పాటు ఆయా నియోజకవర్గ నేతలతో చర్చించారు.

ఈ క్రమంలో కేటీఆర్ అందరి అభిప్రాయాలు పరిగణలోకి తీసుకుని ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. జనగామ టికెట్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, నర్సాపూర్ సునీతా రెడ్డికి కన్ఫార్మ్ అయినట్లు తెలుస్తోంది. అయితే నాంపల్లి, గోషామహల్ స్థానాలపై మాత్రం ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. అటు మల్కాజ్ గిరి స్థానానికి మర్రి రాజశేఖర్ రెడ్డి పేరు వినిపిస్తున్నా.. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తిగా మారింది.


Updated : 10 Oct 2023 9:07 AM GMT
Tags:    
Next Story
Share it
Top