KTR : ఎక్కడ కోల్పోయామో.. అక్కడే తెచ్చుకుంటాం : కేటీఆర్
X
తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిపై కేటీఆర్ స్పందించారు. ఈ ఎన్నికలు బీఆర్ఎస్కు ఓ స్పీడ్ బ్రేక్ అన్నారు. ఈ ఎన్నికల్లో గతం కంటే ఎక్కువ స్థానాలు వస్తాయనుకుంటే.. ఆశించిన ఫలితాలు రాలేదన్నారు. ప్రజలు ఇచ్చిన ప్రతిపక్ష బాధ్యతను సమర్ధవంతంగా నిర్వహిస్తామని చెప్పారు. ఓటమిపై రివ్యూ చేసుకుని మరింత బలంగా మారుతామన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు కోసం అహర్నిశలు శ్రమించిన పార్టీ శ్రేణులకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.
బీఆర్ఎస్ పార్టీ 23 ఏళ్లలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నట్లు కేటీఆర్ తెలిపారు. ప్రజల మన్ననలు తిరిగి పొందే విధంగా పనిచేస్తామన్నారు. తమకు పదేళ్లుగా సహకరించిన అధికారులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. ఇకపై వంద శాతం ప్రజల పక్షాలన నిలబడుతామన్నారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కు శుభాకాంక్షలు చెప్పిన కేటీఆర్.. ప్రభుత్వాన్ని మంచిగా నడపాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఎక్కడ కోల్పోయామో..అక్కడే తెచ్చుకుంటామని.. ఈ సారి మరింత బలంగా తిరిగొస్తామని స్పష్టం చేశారు.