Home > తెలంగాణ > Telangana Elections 2023 > KTR : హామీల అమలుకు డబ్బుల్లేవ్.. సీఎం వీడియోపై కేటీఆర్ సెటైర్లు..

KTR : హామీల అమలుకు డబ్బుల్లేవ్.. సీఎం వీడియోపై కేటీఆర్ సెటైర్లు..

KTR : హామీల అమలుకు డబ్బుల్లేవ్.. సీఎం వీడియోపై కేటీఆర్ సెటైర్లు..
X

కర్నాటకలో అధికారంలోకి రాగానే 5 గ్యారెంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల ముందు హామీ ఇచ్చింది. కాంగ్రెస్ గెలుపులో ఈ 5 గ్యారెంటీలు కీలకంగా మారాయి. అయితే అధికారంలోకి వచ్చాక గ్యారెంటీలను అమలుచేయడం లేదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలో అసెంబ్లీలో ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య మాట్లాడిన వీడియో ఒకటి వైరల్గా మారింది. ‘‘ఎన్నికల్లో ఓట్ల కోసం ఎన్నో హామీలు ఇస్తాం. అంతమాత్రాన అన్నీ ఫ్రీ గా ఇవ్వాలా?. మాకు ఇవ్వాలనే ఉంది కానీ డబ్బులు లేవు’’అని సిద్ధరామయ్య మాట్లాడిన ఓ వీడియో నెట్టింట వైరల్గా మారింది. దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.

కర్నాటక సీఎం వీడియోను షేర్ చేసిన కేటీఆర్ కాంగ్రెస్పై విమర్శలు గుప్పించారు. ‘‘ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి డబ్బులు లేవని కర్నాటక సీఎం సిద్దరామయ్య అంటున్నారు. హామీలు ఇచ్చే ముందు కనీసం ఆలోచించరా. తెలంగాణ భవిష్యత్తు కూడా ఇలాగే ఉంటుందా’ అని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్గా మారింది. కాగా సోషల్‌ మీడియాలో తనపై జరుగుతున్న ప్రచారాన్ని కర్ణాటక సీఎం ఖండించారు. తమ ప్రభుత్వంపై బీజేపీ కావాలని దుష్ప్రచారం చేస్తోందని ఆరోపించారు.




Updated : 19 Dec 2023 6:03 AM GMT
Tags:    
Next Story
Share it
Top