Home > తెలంగాణ > Telangana Elections 2023 > KTR : హ్యాట్రిక్‌ లోడింగ్‌.. ఆసక్తిరేపుతున్న కేటీఆర్ ట్వీట్

KTR : హ్యాట్రిక్‌ లోడింగ్‌.. ఆసక్తిరేపుతున్న కేటీఆర్ ట్వీట్

KTR : హ్యాట్రిక్‌ లోడింగ్‌.. ఆసక్తిరేపుతున్న కేటీఆర్ ట్వీట్
X

తెలంగాణ ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో వెలువడనున్నాయి. 2290 మంది భవితవ్యం రేపు మధ్యాహ్నానికల్లా తేలనుంది. ఎగ్జిట్ పోల్స్ మాత్రం కాంగ్రెస్ వైపు మొగ్గు చూపాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ను మించిన ఫలితాలు వస్తాయని బీఆర్ఎస్ చెబుతోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ 70సీట్లలో గెలుస్తామని ధీమాతో ఉంది. ఈ క్రమంలో కేటీఆర్ చేసిన ట్వీట్ ఆసక్తి రేపుతోంది. ‘‘హ్యాట్రిక్‌ లోడింగ్‌ 3.0.. బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలకు సిద్ధం కండి’’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు. దీనికి గన్‌తో షూట్‌ చేస్తున్న ఫొటోను పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కాగా ఆదివారం ఉదయం 8 గంటలకు పోస్టల్ ఓట్ల లెక్కింపుతో కౌంటింగ్ ప్రారంభమవుతుంది. 8.30 నుంచి ఈవీఎంల కౌంటింగ్ మొదలవుతుంది. ఓట్ల లెక్కింపు కోసం రాష్ట్రవ్యాప్తంగా 49 ప్రాంతాల్లో కౌంటింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు.ప్రతి కౌంటింగ్‌ టేబుల్‌ వద్ద నలుగురు ఎన్నికల సిబ్బంది ఉంటారు. కౌంటింగ్‌ కోసం మొత్తం 1,766 టేబుల్స్‌ ఏర్పాటు చేశారు. 113 నియోజకవర్గాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు 14 టేబుళ్ల ద్వారా జరుగుతుంది. 500లకు పైగా పోలింగ్‌ కేంద్రాలున్న 6 నియోజకవర్గాల్లో 28 టేబుళ్లను ఏర్పాటు చేశారు. పోస్టల్‌ బ్యాలెట్ల కౌంటింగ్ కోసం ప్రత్యేకంగా 500 ఓట్లకు ఒక టేబుల్‌ చొప్పున ఏర్పాటు చేశారు. దాదాపు 1.80 లక్షల మంది పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నారు.


Updated : 2 Dec 2023 4:28 PM GMT
Tags:    
Next Story
Share it
Top