TS Assembly Elections 2023 : దొరికిందే చాన్సని.. చేతివాటం చూపెట్టిన లోకల్ లీడర్లు
X
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. పలు చోట్ల మినహా.. రాష్ట్రమంతా ప్రశాంతంగా పోలింగ్ జరిగింది. దాదాపు 70శాతం పోలింగ్ నమోదైనట్లు తెలుస్తుంది. రాష్ట్రంలో అత్యధికంగా మెదక్ జిల్లాలో పోలింగ్ కాగా.. అత్యల్పంగా హైదరాబాద్ లో పోల్ అయింది. దాదాపు నెల రోజుల నుంచి తీవ్రంగా కష్టపడ్డా కార్యకర్తలు, అభ్యర్థులను కాస్త ఊరట లభించింది. డిసెంబర్ 3న వెలవడే ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. కాగా ఎన్నికల్లో ప్రజలను ప్రలోభపెట్టేందుకు డబ్బు, మధ్యం పంపిణీని నిలువరించేందుకు ఈసీ అన్నిరకాల చర్యలు చేపట్టింది. అయినా.. చాలా ప్రాంతాల్లో ప్రధాన పార్టీలు డబ్బుపంచాయి. చాలా ప్రాంతాల్లో రూ.1000 నుంచి రూ.2000 పంచగా.. కొన్నిచోట్ల 5వేల నుంచి 8వేల వరకు పంచారు. పోలీసులు ఎన్ని చెక్కింగులు జరిపినా డబ్బు చేరాల్సిన చోటుకు చేరిపోయింది.
పోలీసుల తనిఖీల్లో దాదాపు రూ.1000 కోట్లు పంట్టుబడినట్లు అంచనా. తరలించిన డబ్బంతా అభ్యర్థులు ఆయా ప్రాంతాల్లోని లీడర్లు, కార్యకర్తలకు అప్పగించారు. ప్రాంతం, ఓటర్నుబట్టి డబ్బు పంచాలని సూచించారు. ఒక్కో వ్యక్తికి రూ.1500 చొప్పున పంచాలని చెప్తే.. డబ్బుపై గల్లీ లీడర్లు చేతివాటం ప్రదర్శించారు. అభ్యర్తి పంపిన డబ్బులో సగం నొక్కేసి.. మిగిలింది ప్రజలకు పంచారు. కొందరికి రూ. 1000 పంచగా.. అక్కడక్కడ రూ.500లే పంచారు. దాంతో ఆగ్రహించిన ప్రజలు లీడర్లపై మండిపడుతున్నారు. కొందరైతే అందరికీ డబ్బు పంచి.. తమకు పంచకుండా వెళ్లిపోయారని ఆందోళనకు దిగారు. వరంగల్ జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ఈ ఘటనలు వెలుగుచూడగా విషయం తెలుసుకున్న అభ్యర్థులు గల్లీ లీడర్లను నిలదీశారు. కొందరు ద్వితీయ శ్రేణి నేతలు అభ్యర్థిపై కోపంతో ఇదే మంచి ఛాన్స్ అనుకొని జేబులో వేసుకున్నారు. మరోచోట డబ్బలివ్వలేదని సర్పంచ్, ఎంపీటీసీని గదిలోపెట్టి తాళం వేశారు.