మల్లారెడ్డిపై మైనంపల్లి మాటల తూటాలు
X
మంత్రి మల్లారెడ్డిపై మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మల్లారెడ్డికి తాను ఏం మాట్లాడుతాడో తెలియట్లేదని, వయసుకు తగ్గట్లు ప్రవర్తించాలని సూచించారు. ఎంపీగా మల్కాజిగిరి నియోజకవర్గానికి ఏ పని చేశారో చెప్పాలని నిలదీశారు. చేసిన అభివృద్ధి గురించి చెప్పమంటే.. తనను తిడుతూ, విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. మల్లారెడ్డి ఓసారి అద్దంలో చూసుకోవాలంటూ.. ఏకవచనంతో కూడిన మాటల దాడి చేశారు. ఓ దశలో పరుష దూషణకు కూడా మైనంపల్లి పాల్పడ్డారు.
మైనంపల్లి వ్యాఖ్యలను వ్యతిరేకించిన బీఆర్ఎస్.. ఓటమి భయంతోనే కాంగ్రెస్ నేతలు ఇలా మాట్లాడుతున్నారని విమర్శించారు. కాగా మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మైనంపల్లి హనుమంతరావు ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ టికెట్ల కేయింపు సమయంలో మైనంపల్లి తన కుమారుడికి మెదక్ టికెట్ ఇవ్వాలని కోరారు. దాన్ని బీఆర్ఎస్ పార్టీ తిరస్కరించడంతో బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. రానున్న ఎన్నికల్లో మెదక్, మల్కాజిగిరి స్థానాల్లో బీఆర్ఎస్ ను ఓడించి తీరతానని ధీమా వ్యక్తం చేస్తున్నారు.