TS Assembly Elections 2023 : కాంగ్రెస్ అంటే అన్నీ స్కాంలే.. బీఆర్ఎస్ అంటే అన్నీ స్కీంలే: మల్లారెడ్డి
X
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత.. రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిషలు కష్టపడ్డ, శ్రమించిన నాయకుడు మన కేసీఆర్ అని అన్నారు మంత్రి మల్లారెడ్డి. 9 ఏళ్ల పాలనలో ప్రజా అభివృద్ధిని, సంక్షేమాన్ని.. ప్రతీ గడపకు సంక్షేమ ఫలాల్ని అందించిన నేత కేసీఆర్ అని అన్నారు. మేడ్చల్ నియోజక వర్గంలో ఏర్పాటుచేసిన ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడిన మల్లారెడ్డి.. బీఆర్ఎస్ చేసిర అభివృద్ధిని ప్రజలకు గుర్తుచేశారు. వ్యవసాయ రంగానికి నిరంతర సాయం అందిస్తూ.. తెలంగాణ రైతులను దేశానికి ఆదర్శంగా నిలిపిన ఘనత కేసీఆర్ కు దక్కుతుందని అన్నారు. దళితులను, సబ్బండ వర్గాలను ఆదుకుంటున్న నేత కేసీఆర్.
దేశానికి రోల్ మోడల్ గా నిలిచారు. రాజకీయాలకు అతీతంగా పేదల సంక్షేమం కోసం పనిచేశారు. అతి తక్కువ సమయంలో ఏ పార్టీకీ సాధ్యం కాని విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపించారు. మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్ట్ ల ద్వారా రాష్ట్రంలోని ప్రతీ మూలకు నీళ్లందించిన అపర భగీరథుడు కేసీఆర్ అని కొనియాడారు. మేడ్చల్ లో 40వేల మంది పేదలకు ఇళ్ల పట్టాలు అందించినందుకు కృతజతలు తెలిపారు. ఘట్కేసర్ లో గురుకుల పాఠశాల ఏర్పాటు చేయాలని కోరారు. శామీర్ పేట్ చెరువును టూరిస్ట్ స్పాట్ గా తీర్చిదిద్దాలని కోరారు.