Mandava Venkateswara Rao : బీఆర్ఎస్కు షాక్.. కాంగ్రెస్లోకి మాజీ మంత్రి
X
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ కీలక నేత, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర రావు ఇవాళ రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. గత పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో చేరిన మండవ.. తనకు తగిన ప్రాధాన్యం, గౌరవం ఇవ్వడంలేదని బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. మండవ రాజీనామా.. నిజామాబాద్ జిల్లాలోని సెటిలర్ల ఓట్లపై ప్రభావం ఎక్కువగా ఉండనుంది. గతంలో డిచ్ పల్లి, నిజామాబాద్ రూరల్ నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు మండవ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా, ప్రణాళిక సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు. 1985లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డిచ్ పల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచిన మండవ.. ఆ తర్వాత 1989,1994,1999 ఎలక్షన్స్ లో వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయనకు ఎక్సైజ్ శాఖమంత్రిగా , భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా చేసిన అనుభవం ఉంది.