Home > తెలంగాణ > Telangana Elections 2023 > Revanth Reddy :కాంగ్రెస్ మేనిఫెస్టో.. విద్యార్థినులకు మెట్రో ప్రయాణం ఫ్రీ!

Revanth Reddy :కాంగ్రెస్ మేనిఫెస్టో.. విద్యార్థినులకు మెట్రో ప్రయాణం ఫ్రీ!

Revanth Reddy :కాంగ్రెస్ మేనిఫెస్టో.. విద్యార్థినులకు మెట్రో ప్రయాణం ఫ్రీ!
X

ప్రజలను ఆకర్షించేందుకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలను తీసుకొస్తుంది. కొత్త కొత్త పథకాలు, హామీలను అందులో చేర్చుతున్నారు. ఇప్పటివరకు విద్యార్థినులకు స్కూటీలు, ల్యాప్ టాప్ లు ఇస్తామని చెప్పుకొస్తున్న కాంగ్రెస్.. తాజాగా మరో కీలక హామీని ఆ లిస్ట్ లో చేర్చింది. కాంగ్రెస్ ‘ప్రజా మేనిఫెస్టో’ రూపకల్పన దాదాపు పూర్తి అయింది. అందులో పదో తరగతి నుంచి Phdలు చేసే విద్యార్థినులకు అంటే.. 14 ఏళ్లు నిండి చదువుకుంటున్న బాలికలకు మెట్రో ప్రయాణాన్ని ఉచితం చేస్తామని కాంగ్రెస్ ప్రకటించబోతున్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా ఇటు ఏపీ తరహాలో అమ్మఒడి పథకం తెచ్చే ఆలోచనను పరిశీలిస్తోంది. వీటితో పాటు వార్డు మెంబర్లకు నెలనెలా రూ.1500 గౌరవ వేతనం, హైదరాబాద్ మహా నగర అభివృద్ధికి ప్రత్యేక ప్లాన్ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ నెల 14న మేనిఫెస్టో విడుదలయ్యే ఛాన్స్ ఉంది.




Updated : 12 Nov 2023 12:58 PM IST
Tags:    
Next Story
Share it
Top