Asaduddin Owaisi : రాహుల్ వెంటనే చికిత్స చేయించుకోవాలి.. ఒవైసీ
X
తెలంగాణ ఎన్నికల ప్రచారం ఊపందుకోవడంతో మాటల తూటాలు పేలుతున్నాయి. వ్యక్తిగత విషయాలను కూడా ప్రస్తావిస్తూ దాడులు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యక్తిగత జీవితంపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘రాహుల్ గాంధీకి యాభై ఏళ్లు దాటాయి. పెళ్లి కాకపోవడడంతో ఒంటరితనంతో బాధపడుతున్నారు. ఆయనకు వెంటనే చికిత్స చేయాలి. ఎవరి దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవాలో నేను చెబుతాను. హైదరాబాద్‌లో చాలా మంది మంచి డాక్టర్ల ఉన్నారు. రాహుల్ నేను చెప్పే డాక్టర్ దగ్గరికి వెళ్లి చికిత్స చేయించుకోవాలి’’ అని ఓవైసీ అన్నారు.
ఎంఐఎం బీజేపీ తొత్తు పార్టీ అని రాహుల్ విమర్శిస్తుండడంతో ఒవైసీ ఈ వ్యాఖ్యలు చేశారు. రాహుల్ ముస్లింల సమస్యల గురించి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. ‘‘మీరు 370 రాజ్యాంగ అధికరణ రద్దుపై ఎందుకు స్పందించలేదు? ట్రిపుల్ తలాక్ రద్దుపై ఎందుకు మాట్లాడడం లేదు? ముస్లింలపై జరుగుతున్న మూకదాడులపై మీ స్పందనేంటి? ముస్లిల రిజర్వేషన్లపై ఎందుకు మాట్లాడడం లేదు. వీటిపై మాట్లాడ్డానికి ఎందుకు భయపడుతున్నారు?’’ అని ప్రశ్నించారు. రాహుల్‌పై ఒవైసీ శనివారం కూడా వివాదస్పద వ్యాఖ్యాల చేశారు. రాహల్‌కు భార్య లేదు కాబట్టి ఎప్పుడూ ఓ స్నేహితుడి గురించి ఆలోచిస్తాడని, ఆ స్నేహితుడు మోదీ అని అన్నారు. మోదీకి ఇద్దరు స్నేహితులు ఉన్నారని, ఒకరు ఓవైసీ మరొకరు కేసీఆర్ అని రాహుల్ అనడంతో ఒవైసీ స్పందించారు.