Home > తెలంగాణ > Telangana Elections 2023 > KTR : కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయం - కేటీఆర్

KTR : కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయం - కేటీఆర్

KTR : కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయం - కేటీఆర్
X

రాష్ట్రంలో మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని, కేసీఆర్‌ మళ్లీ ముఖ్యమంత్రి అవడం ఖాయమని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. చిన్న చిన్న అసంతృప్తులను పక్కనపెట్టి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా భద్రాచలం, ఇల్లెందులో నిర్వహించిన రోడ్‌ షోలో కేటీఆర్ మాట్లాడారు. ఎన్నికల్లో 11 సార్లు గెలిచిన కాంగ్రెస్‌ 24 గంటల కరెంట్‌ ఇచ్చిందా? అని ప్రశ్నించారు. కానీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోనే 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ ఇచ్చామని చెప్పారు.

భద్రాచలం వచ్చినప్పుడు రాముడి పాదాలు తాకాలనుకున్నానని, కానీ అధికారుల విజ్ఞప్తి మేరకు వెళ్లలేదని కేటీఆర్ చెప్పారు. త్వరలోనే మళ్లీ వచ్చి రామయ్య దర్శనం చేసుకుంటానని అన్నారు. ఈసారి కచ్చితంగా గులాబీ వనంలోకి భద్రాచలం చేరాలని ఆకాంక్షించారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే వరదల ముంపు నుంచి శాశ్వత పరిష్కారం చూపిస్తామని కేటీఆర్ అన్నారు. యాదాద్రి కంటే గొప్పగా.. భద్రాచలం రామాలయాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.




Updated : 19 Nov 2023 11:45 AM GMT
Tags:    
Next Story
Share it
Top