Home > తెలంగాణ > Telangana Elections 2023 > KTR : కేసీఆర్‌ ఏం చేశారో ప్రజల కళ్ల ముందే ఉంది: కేటీఆర్‌

KTR : కేసీఆర్‌ ఏం చేశారో ప్రజల కళ్ల ముందే ఉంది: కేటీఆర్‌

KTR : కేసీఆర్‌ ఏం చేశారో ప్రజల కళ్ల ముందే ఉంది: కేటీఆర్‌
X

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం మొయినాబాద్‌లో బీఆర్ఎస్​ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రోడ్​ షోలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులకు 24 గంటల కరెంటు ఇస్తున్న ప్రభుత్వం బీఆర్​ఎస్​ అని.. 70 లక్షల రైతుల ఖాతాల్లో రూ.75 వేల కోట్లు జమ చేసిన సీఎం కేసీఆర్‌ అని తెలిపారు. పని చేసే నాయకుడిని ప్రోత్సహించడం మన కర్తవ్యమన్నారు.

రెండుసార్లు ఆశీర్వదిస్తే కేసీఆర్ ఏం చేశారో ప్రజల కళ్ల ముందే ఉందని కేటీఆర్‌ పేర్కొన్నారు. రైతుబీమా పెట్టి ధీమాగా ఉండేలా కేసీఆర్ చేశారని తెలిపారు. చేవెళ్లకు ఇచ్చిన మాట ప్రకారం 111 జీవోను ఎత్తేశామనని, 111 జీవోలో న్యాయపరమైన చిక్కులను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పని చేసే నాయకుడిని ప్రోత్సహించడం ప్రజల బాధ్యత అని, కేసీఆర్‌కు అత్యంత సన్నిత ఎమ్మెల్యేల్లో ఒకరైన కాలె యాదయ్యను మరోసారి శాసనసభకు పంపించాలని కోరారు.

చేవెళ్ల నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కాలె యాదయ్య ఇప్పటికే రెండు సార్లు గెలిచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఎమ్మెల్యే సొంత ఇంట్లోనే ఎంపీపీ, జడ్పీటీసీ లు ఉండడంతో కేసీఆర్ కుటుంబ పాలనా లాగే నియోజకవర్గంలో యాదయ్య ది కూడా కుటుంబ పాలన అని నియోజకవర్గంలో ప్రజలు అంటున్నారు. నియోజకవర్గంలో రోజు రోజుకు బీఆర్ఎస్ గ్రాఫ్ తగ్గి కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతుంది. దీనికి కారణం ఎమ్మెల్యే తనయుడు అక్కడే జడ్పీటీసీ సభ్యులుగా ఉండడమే కారణం అంటున్నరు అక్కడి ప్రజలు. అక్కడ బీఆర్ఎస్ పార్టీ బలహీనంగా ఉండడం తో కేటీఆర్ రోడ్ షో ద్వారా కొంతైనా బీఆర్ఎస్ కి బలం వస్తుందని భావించి మొయినాబాద్ లో ఏర్పాటు చేసినట్లు బయట టాక్.




Updated : 16 Nov 2023 3:16 PM IST
Tags:    
Next Story
Share it
Top