KTR : గెలిచేది మేమే.. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తప్పు : కేటీఆర్
X
తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని మంత్రి కేటీఆర్ అన్నారు. ఎగ్జిట్ పోల్స్ చూసి కార్యకర్తలు అధైర్యపడొద్దని చెప్పారు. డిసెంబర్ 3న వచ్చే ఫలితాల్లో 70కి పైగా సీట్లలో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.
ఎవరూ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదని.. కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం అవ్వడం పక్కా అన్నారు. ఇంకా ఓటింగ్ కోసం చాలా మంది క్యూలో ఉన్నారని.. అలాంటప్పుడు ఎగ్జిట్ పోల్స్ ప్రకటించడం ఏంటని ప్రశ్నించారు.
రేపు ఉదయానికి పైనల్ పోలింగ్ పర్సంటేజ్ వస్తదన్నారు. డిసెంబర్ 3న బీఆర్ఎస్ గెలిస్తే తెలంగాణకు క్షమాపణ చెబుతారా అని అడిగారు.
కాగా తెలంగాణలో ఈ సారి హంగ్ తప్పదని పలు ఎగ్జిట్ పోల్ సర్వేలు చెబుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోటాపోటీ తప్పదని తేలింది. కొన్ని సర్వేలు కాంగ్రెస్, మరికొన్ని బీఆర్ఎస్ అత్యధిక సీట్లను కైవసం చేసుకుంటాయని తెలిపాయి. ఈ క్రమంలో డిసెంబర్ 3న వెలువడే ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.