Home > తెలంగాణ > Telangana Elections 2023 > KTR : డిసెంబర్ 4న నిరుద్యోగులతో జాబ్ క్యాలెండర్‌‌పై చర్చ.. మంత్రి కేటీఆర్

KTR : డిసెంబర్ 4న నిరుద్యోగులతో జాబ్ క్యాలెండర్‌‌పై చర్చ.. మంత్రి కేటీఆర్

KTR  : డిసెంబర్ 4న నిరుద్యోగులతో జాబ్ క్యాలెండర్‌‌పై చర్చ.. మంత్రి కేటీఆర్
X

తెలంగాణ మహోద్యమానికి నవంబర్ 29నే బీజం పడిందని.. అందుకే 14 ఏళ్లుగా అదే రోజున దీక్షా దివాస్ జరుపుకుంటున్నామన్నారు మంత్రి కేటీఆర్. ఈ ఏడాది కూడా దీక్షా దివాస్ ను ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడుతూ.. తెలంగాణ అమరవీరుల త్యాగాలు, కేసీఆర్ పోరాట స్ఫూర్తిని నవంబర్ 29న దీక్షా దివస్ ద్వారా తెలపాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజలంతా నవంబర్ 29న దీక్ష దివాస్ జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఆ రోజు బీఆర్ఎస్ శ్రేణులు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కేటీఆర్ సూచించారు. కేసీఆర్ పోరాటంతోనే మనకు తెలంగాణ సాకారమైందని, ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆయన చేసిన అమరణ నిరాహార దీక్షతోనే కేంద్రం దిగివచ్చి తెలంగాణ ప్రకటించిందని అన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని కాంగ్రెస్ పార్టీ అడుగడుగునా అడ్డుకుందని మండిపడ్డారు. తెలంగాణకు స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామరక్ష అని అన్నారు.

రైతుబంధు మాది..

రైతు బంధు కొత్త పథకం కాదని.. కొన్నేళ్లుగా కొనసాగుతున్న పథకమని కేటీఆర్ తెలిపారు. ఈ పథకానికి నిధులు మంజూరుకు అనుమతి ఇస్తే కాంగ్రెస్​ నాయకులు ఎందుకు ఆరోపణలు చేస్తున్నారని ప్రశ్నించారు. . రైతు బంధు పథకం కేసీఆర్‌ పేటెంట్‌ అని చెప్పారు. రైతుల ఖాతాల్లో రైతుబంధు పైసలు వేస్తే రేవంత్‌ రెడ్డి ఎందుకు ఆగమవుతున్నాడని ప్రశ్నించారు. రైతుల పట్ల కాంగ్రెస్‌కు చిత్త శుద్ధిలేదన్నారు. పీఎం కిసాన్‌ నిధులు ఇస్తే తప్పు లేదుకానీ రైతు బంధు ఇస్తే తప్పా అని ప్రశ్నించారు.

వాళ్లు ఉద్యోగం చేసినోళ్లా..

పదేళ్లలో తెలంగాణ కంటే ఎక్కువ ఉద్యోగాలు భర్తీ చేసిన రాష్ట్రం దేశంలోనే లేదని కేటీఆర్ అన్నారు. 2004 -2014 మధ్య కేవలం 10 వేల ఉద్యోగాలు ఇచ్చారని తెలిపారు. కర్ణాటకలో ఏడాదిలోపు లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పటివరకు ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదని మండిపడ్డారు. రాహుల్‌గాంధీ ఉద్యోగం చేసిన వ్యక్తి కాదు.. అసలు దరఖాస్తే చేయలేదు. రాహుల్‌కు ఉద్యోగమంటే ఏంటో తెలుసా? అని ప్రశ్నించరు. రాహుల్, రేవంత్ లకు నిరుద్యోగుల బాధలు ఎలా తెలుస్తాయని విమర్శించారు. తాను పరీక్షలు రాశానని.. ఇంటర్వ్యూలకూ హాజరయ్యానని వెల్లడించారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే డిసెంబర్ 4 నేనే స్వయంగా అశోక్ నగర్ వెళ్లి జాబ్ క్యాలెండర్‌ను రూపొందిస్తానని కేటీఆర్ హామీ ఇచ్చారు.

ఒక్కసీటు లేకుండా చేస్తం..

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి బీజేపీతో లోపాయికారి ఒప్పందం ఉందని కేటీఆర్ ఆరోపించారు. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ గోషా మహల్, కరీంనగర్, కోరుట్ల నియోజకవర్గాల్లో డమ్మీ అభ్యర్థులను పెట్టిందని అన్నారు. ఈ సారి గోషా మహల్‌లో రాజాసింగ్‌ను, కరీంనగర్‌లో బండి సంజయ్‌ను ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీకి తెలంగాణలో ఒక్క సీటు లేకుండా చేస్తామన్నారు




Updated : 26 Nov 2023 1:35 PM IST
Tags:    
Next Story
Share it
Top