Home > తెలంగాణ > Telangana Elections 2023 > KTR : తెలంగాణను నెంబర్ 1 స్థానంలో నిలబెట్టడమే మా లక్ష్యం : కేటీఆర్

KTR : తెలంగాణను నెంబర్ 1 స్థానంలో నిలబెట్టడమే మా లక్ష్యం : కేటీఆర్

KTR : తెలంగాణను నెంబర్ 1 స్థానంలో నిలబెట్టడమే మా లక్ష్యం : కేటీఆర్
X

తెలంగాణను నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టడమే తమ లక్ష్యమని మంత్రి కేటీఆర్ అన్నారు. ఢిల్లీ నాయకుల అబద్దాలకు మోసపోవద్దని సూచించారు. తెలంగాణను గెలవాలనేదే కాంగ్రెస్, బీజేపీల ఆలోచన అని.. కానీ తెలంగాణ ప్రజలను గెలపించాలన్నదే తమ ఆలోచన అన్నారు. నాగోల్‌లో నిర్వహించిన చేనేత ఆత్మీయ స‌మ్మేళ‌నంలో కేటీఆర్ పాల్గొన్నారు. సంపద పెంచాలి.. పేదలకు పంచాలన్నదే తమ మంత్రం అన్నారు.

గతంలో అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ తెలంగాణకు చేసిందేమిలేదని కేటీఆర్ విమర్శించారు. ఇక్కడ 4వేల పెన్షన్ అంటున్న హస్తం పార్టీ.. రాజస్థాన్, కర్నాటకలో ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ సంపద పెంచిన తర్వాత వచ్చి అది ఇస్తాం.. ఇది ఇస్తాం అని అంటున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆరు నెలలకో ముఖ్యమంత్రి మారతారని.. దాంతో రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరి అవుతుందన్నారు. చేనేతల సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని కేటీఆర్ చెప్పారు. ఈ సారి అధికారంలోకి వస్తే మరిన్ని పథకాలు తీసుకొస్తామని హామీ ఇచ్చారు.


Updated : 14 Nov 2023 8:32 PM IST
Tags:    
Next Story
Share it
Top