TS Assembly Elections 2023 : ఎల్బీనగర్ నియోజకవర్గం బూత్ కమిటీ సమావేశంలో మంత్రి కేటీఆర్
X
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్బీనగర్ నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ పర్యటించారు. ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధి హస్తినాపురంలోని ఓ గార్డెన్లో బీఆర్ఎస్ నియోజకవర్గ బూత్ కమిటీల విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయగా.. మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 2014కు ముందు విద్యుత్ సరఫరా ఎలా ఉందో.. ఇప్పుడు ఎలా ఉందో ప్రజలు గుర్తించాలన్నారు. 2014కు ముందు కరెంటు కోతల గురించి అడిగితే పట్టించుకునే నాథుడే లేడన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో విద్యుత్ వ్యవస్థను ఎలా తీర్చిదిద్దారో ప్రజలు ఆలోచించాలన్నారు. కాంగ్రెస్‌కు ఓటు వేసి తప్పు చేశామని కర్ణాటక రైతులు చెబుతున్నారని.. విద్యుత్ లేక ఆ రాష్ట్రంలో పారిశ్రామిక వేత్తలు, రైతులు రోడ్లు ఎక్కి నిరసనలు చేస్తున్నారని చెప్పారు.
తాము అధికారంలోకి వస్తే.. నాగోల్ నుంచి ఎల్బీనగర్కు మెట్రోను కలుపుతూ పెద్ద అంబర్పేట్ వరకు మెట్రో సేవలు విస్తరిస్తామన్నారు కేటీఆర్. ఎల్బీనగర్ నుంచి శంషాబాద్‌కు వెళ్లేందుకు కూడా మెట్రో సేవలు అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. హైదరాబాద్ అభివృద్ధి చూసి రజనీకాంత్ ప్రశంసించారన్నారు