Home > తెలంగాణ > Telangana Elections 2023 > Malla Reddy : మల్లన్న అఫిడవిట్ల మాయాజాలం.. చూస్తే అవాక్కవ్వాల్సిందే..

Malla Reddy : మల్లన్న అఫిడవిట్ల మాయాజాలం.. చూస్తే అవాక్కవ్వాల్సిందే..

Malla Reddy  : మల్లన్న అఫిడవిట్ల మాయాజాలం.. చూస్తే అవాక్కవ్వాల్సిందే..
X

మంత్రి మల్లారెడ్డి అంటే బీఆర్ఎస్కే ఓ బ్రాండ్. మైకు పట్టుకున్నారంటే చాలు డైలాగులతో అల్లాడిస్తుంటారు. తన కామెంట్లతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. 2018లో మేడ్చల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆయన.. ఈ సారి కూడా అక్కడి నుంచే బరిలోకి దిగుతున్నారు. ఇప్పటికే నామినేషన్ సైతం దాఖలు చేశారు. నామినేషన్లో భాగంగా ఆయన సమర్పించిన అఫిడవిట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఇప్పటి వరకూ మూడు సార్లు ఎన్నికల్లో పోటీ చేశారు మల్లారెడ్డి. అయితే ఎన్నికల అఫిడవిట్లో తన విద్యార్హతకు సంబంధించి ఎక్కడ చదువుకున్నారనే దానిపై మూడు స్లార్లు వేర్వేరు సమాచారం ఇచ్చారు. 2014లో మల్కాజిగిరి నుంచి ఎంపీగా పోటీ చేసిన మల్లారెడ్డి.. అప్పుడు ఇచ్చిన అఫిడవిట్లో సికింద్రాబాద్ ప్యాట్నీలోని గవర్నమెంట్ కాలేజీ నుంచి 1973లో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణుడైనట్టు పేర్కొన్నారు.

2016లో బీఆర్ఎస్లో చేరిన మల్లారెడ్డి 2018లో మేడ్చల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిపొందారు. ఆ సమయంలో ఇచ్చిన అఫిడవిట్లో సికింద్రాబాద్లోని వెస్లి కాలేజ్ నుంచి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణుడైనట్టు ఉంది. ఇక ఇప్పుడు ఇచ్చిన అఫడవిట్లో రాఘవ లక్ష్మిదేవి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ నుంచి ఇంటర్మీడియట్ పాస్ అయినట్టు పేర్కొన్నారు. 2014లో ప్యాట్నీలోని గవర్నమెంట్ కాలేజీ, 2018లో వెస్లి కాలేజ్, ఇప్పుడు రాఘవ లక్ష్మిదేవి గవర్నమెంట్ కాలేజ్ నుంచి ఇంటర్మీడియట్ పాస్ అయినట్టు అఫిడవిట్లలో పేర్కొన్నారు. మూడు సార్లు మూడు కాలేజీలు మార్చడంతో ఆయన విమర్శలు వస్తున్నాయి. మూడు అఫిడవిటలు.. మూడు కాలేజీలు అంటూ కామెంట్లు చేస్తున్నారు.


Updated : 13 Nov 2023 9:19 PM IST
Tags:    
Next Story
Share it
Top