Ponnam Prabhakar : బీఆర్ఎస్ మాజీ మంత్రులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతుర్రు : పొన్నం
X
బీఆర్ఎస్ మాజీ మంత్రులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. తమ ప్రభుత్వం ఏర్పడి 2రోజులే అయినా.. అది ఎప్పుడు, ఇది ఎప్పుడు అమలు చేస్తారని అడగడం ఏంటని ప్రశ్నించారు. గత 10ఏళ్లలో బీఆర్ఎస్ ఏం చేసిందని నిలదీశారు. ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే మహిళలకు ఆర్టీసి బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామన్నారు. భవిష్యత్లో మిగితా గ్యారెంటీ స్కీంలను అమలుచేస్తామని చెప్పారు.
బీఆర్ఎస్ హయాంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని ప్రజల కళ్ల ముందు ఉంచుతామన్నారు.
ఆర్టీసీని నిర్వీర్యం చేయాలనే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదని పొన్నం చెప్పారు. అవసరమైతే రద్దు చేసిన ఆర్టీసి సంఘాల ప్రతినిధులతో ఆర్టీసీ సమస్యలపై చర్చిస్తామన్నారు. ఆటో డ్రైవర్ల సమస్యలు ఏంటో తమ దృష్టికి తెస్తే పరిశీలిస్తామని తెలిపారు. ఒక స్కీమ్ మొదలుపెట్టినప్పుడు కొన్ని సమస్యలుంటాయని.. నిరంతరం సమీక్ష చేసుకుని వాటిని అధిగమిస్తామన్నారు. ఇక యశోద ఆస్పత్రిలో కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై కేటీఆర్, హరీష్ రావులను అడిగి తెలుసుకున్నట్లు చెప్పారు. కేసీఆర్కు లోపల ట్రీట్మెంట్ జరుగుతుందని.. అందుకే ఆయన్ని కలవలేదన్నారు.