Ponnam Prabhakar : గత ప్రభుత్వం ఆర్భాటాలకు పోయింది.. మంత్రి పొన్నం ప్రభాకర్
X
గత (బీఆర్ఎస్) ప్రభుత్వం ఆర్భాటాలకు పోయిందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. నేటి అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ఆ శాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన శ్వేతపత్రంపై హరీశ్ రావు విమర్శలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. శ్వేత పత్రం తప్పుల తడకగా ఉన్నదనడం సరికాదన్నారు. ప్రజల సొమ్మును బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్భాటాలకు ఖర్చు చేసిందని అన్నారు. ప్రజా సంక్షేమం గాలికొదిలేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తారీఖున జీతం ఇవ్వలేకపోయిందని అన్నారు. ఉద్యోగులకు ఒకటో తారీఖున జీతం ఎందుకు ఇవ్వలేకపోయరో చెప్పాలని మాజీ మంత్రి హరీశ్ రావును మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. కాగా గత ప్రభుత్వ హయాంలో అప్పులపై ఇవాళ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క 42 పేజీల శ్వేత పత్రం రిలీజ్ చేశారు. గత ప్రభుత్వం 6,71,757 కోట్ల అప్పు చేసిందని శ్వేతపత్రంలో తెలిపారు.