Home > తెలంగాణ > Telangana Elections 2023 > Minister Seethakka Biography : మావోయిస్ట్ నుంచి మంత్రిగా.. సీతక్క జీవిత ప్రయాణంలో..

Minister Seethakka Biography : మావోయిస్ట్ నుంచి మంత్రిగా.. సీతక్క జీవిత ప్రయాణంలో..

Minister Seethakka Biography   : మావోయిస్ట్ నుంచి మంత్రిగా.. సీతక్క జీవిత ప్రయాణంలో..
X

సీతక్క.. తెలంగాణలో ఈ పేరు తెలియని వారుండరేమో. కరోనా సమయంలో ఆదివాసీ గూడాల్లో చేసిన సేవా ఆమెను ప్రపంచానికి పరిచయం చేసింది. మావోయిస్ట్ నుంచి మంత్రిగా దాక ఆమె ప్రయాణం ఎంతో మందికి ఆదర్శం. మావోయిస్ట్గా ప్రభుత్వంపై పోరాడిన ఆమె.. ఇప్పుడు అదే ప్రభుత్వంలో కీలక స్థానంలో ఉన్నారు. ములుగు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సీతక్క రేవంత్ కేబినెట్లో చోటు సంపాదించుకున్నారు. కాసేపట్లో రేవంత్తో కలిసి ఆమె ప్రమాణం చేయనున్నారు.





ఉమ్మడి వరంగల్ జిల్లా ములుగు మండలం జగ్గన్నగూడెంకి చెందిన సమ్మక్క, సమ్మయ్యలకు సీతక్క జన్మించారు. ప్రభుత్వ గిరిజన వసతి గృహంలో ఉంటూ చదువును కొనసాగించారు. అదే సమయంలో నక్సలైట్‌గా ఉన్న తన సోదరుడు సాంబయ్య పోలీసుల చేతిలో మరణించాడు. బావ శ్రీరాముడు దళంలోనే ఉండటంతో 14 ఏళ్లకే నక్సలిజంలో చేరారు సీతక్క. అయినా చదువును మాత్రం ఆపలేదు. పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు జైలులో ఉంటూనే టెన్త్ క్లాస్ పూర్తి చేశారు. ఆ తర్వాత తన బావ శ్రీరాముడినే పెళ్లి చేసుకుంది. కొడుకు పుట్టిన తర్వాత దంపతుల మధ్య విబేధాలు రావడంతో దళంలో ఉండలేక 1996లో జనజీవన స్రవంతిలోకి వచ్చారు సీతక్క.





మావోయిస్ట్ దళంలో బయటకు వచ్చిన సీతక్క ఐటిడీఏలో పనిచేస్తూ చదువు కొనసాగించారు. ఇక 2004లో టీడీపీ నుంచి ములుగు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 2009లో మరోసారి బరిలో నిలిచి కాంగ్రెస్ అభ్యర్థి పోదెం వీరయ్యపై విజయం సాధించి.. అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2014లో టీడీపీ నుంచి మరోసారి పోటీ చేసి ఓడిపోయారు. రాష్ట్రంలో మారిన పరిస్థితులతో 2017లో కాంగ్రెస్ లో చేరిన ఆమె.. 2018లో కాంగ్రెస్ అభ్యర్థి పోటీ చేసి గెలపొందారు. ఆలా ఎమ్మెల్యే అయిన సీతక్క నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ చేదోడు వాదోడుగా నిలిచారు. కరోనా సమయంలో కొండలు, గుట్టలు ఎక్కుతూ ఆమె చేసిన సేవా ప్రపంచానికి సీతక్కను ప్రపంచానికి పరిచయం చేసింది.





కరోనా సమయంలో సీతక్క పేరు తెలుగు రాష్ట్రాల్లో మార్మోగిపోయింది. తన సేవా కార్యక్రమాలతో అంత పాపులర్ అయ్యారు. తాజాగా మరోసారి ములుగు నుంచి పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి బడే నాగజ్యోతిపై భారీ మెజార్టీతో గెలిచారు. ఈ క్రమంలో కాంగ్రెస్ హైకమాండ్ మంత్రిగా ఆమెకు ప్రమోషన్ ఇచ్చింది. రేవంత్ రెడ్డితో పాటు ప్రమాణం చేసే మంత్రుల లిస్ట్లో సీతక్క కూడా ఉంది. ఆమెకు హోంశాఖ కేటాయించే అవకాశాలున్నాయి. మంత్రిగానూ తనదైన మార్క్ తో మంచి పేరు తెచ్చుకుంటుందని ఆమె అభిమానులు చెబుతున్నారు.





Updated : 7 Dec 2023 6:45 AM GMT
Tags:    
Next Story
Share it
Top