C. Laxma Reddy : కేసీఆర్ వల్లే.. ప్రజలు ఆనందంగా పండుగలు జరుపుకుంటున్నారు: చెర్లకోల లక్ష్మా రెడ్డి
X
రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా పండుగలు జరుపుకుంటున్నారంటే.. బీఆర్ఎప్ ప్రభుత్వం అందరికీ ఆర్థికంగా తోర్పాటందించడం వల్లే అని.. జడ్చెర్ల ఎమ్మెల్యే చెర్లకోల లక్ష్మా రెడ్డి అన్నారు. వలసల జిల్లాగా పేరుగాంచిన పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేసిన ఘనత సీఎం కేసీఆర్ కు దక్కుతుందని చెప్పుకొచ్చారు. జడ్చర్లలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న లక్ష్మారెడ్డి.. బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధిని, కేసీఆర్ పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు జిల్లాలో ఎక్కడ చూసినా.. సమస్యలే ఉండేవని గుర్తుచేశారు. ప్రజలు తాగు నీరు, సాగు నీరు, రోడ్లు.. సరైన సధుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారని తెలిపారు. కేసీఆర్ తీసుకున్న చర్యల వల్ల జిల్లాలో అన్నిరకాల అభివృద్ధి పనులు జరిగాయని అన్నారు. జడ్చర్ల పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దారు.
కేసీఆర్ కోరుకున్న బంగారు తెలంగాణ.. ఇక్కడి ప్రజల్లో కనిపిస్తుంది. రానున్న ఎన్నికల్లో మరోసారి అధికారం ఇస్తే.. మరో ఐదేళ్లలో జిల్లా రూపు రేకలు మార్చిచూపిస్తామని హామీ ఇచ్చారు. పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తైతే.. జడ్చర్ల నియోజక వర్గంలో లక్షా 50 వేల ఎకరాలకు సాగు నీరు అందే అవకాశం ఉంది. అది సాధ్యం కావాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రావాలని కోరారు. ఉదండాపూర్ ముంపు గ్రామ ప్రజలు.. ఈ జిల్లా ప్రజలందరి కోసం త్యాగం చేశారు. వారందరికీ త్వరలోనే ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ముంపు గ్రామాలకు ఆర్థిక సాయం, జడ్చర్లకు బైపాస్ రోడ్డు, రూరల్ పోలీస్ స్టేషన్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సాంక్షన్ చేయాలని డిమాండ్ చేశారు. వెనకబడిన మహబూబ్ నగర్ జిల్లాను సస్యశ్యామలం చేసిన కేసీఆర్ కు.. రానున్న ఎలక్షన్స్ లో జిల్లాలోని 14 నియోజక వర్గాల్లో గెలిచి కానకు ఇస్తామని లక్ష్మారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.