Modi And KCR: ఒకే రోజు.. అదే నియోజకవర్గానికి.. సీఎం, పీఎం
X
ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ప్రధాన పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. జాతీయ పార్టీల నాయకుల పెద్దలు రాష్ట్రానికి క్యూకట్టి పర్యటన చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు రాగా.. బీజేపీ నుంచి పీఎం మోదీ, హోం మంత్రి అమిత్ షా, జేపీ నడ్డా, యోగీ ఆధిత్యనాథ్ తదితరులు ప్రచారం చేస్తున్నారు. భారీ బహిరంగసభలు, ర్యాలీలు ఏర్పాటుచేస్తున్నారు. ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి సీఎం కేసీఆర్, హరీశ్ రావు, కేటీఆర్ లు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.
కాగా ఇవాళ బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు కీలకమైన రోజు. ఒకే రోజు.. అదే నియోజకవర్గంలో ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన్యం సంతరించుకుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ లో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్ హాజరవుతారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన భారీ బహిరంగసభలో మోదీ మాట్లాడుతారు. ప్రధాని మోదీ సభ నేపథ్యంలో పోలీసులు భారీ భద్రత ఏర్పాటుచేశారు.