Sabita Indra Reddy' : మంత్రి సబిత అనుచరుడి ఇంట్లో భారీగా డబ్బు సీజ్
X
తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బంధువుల నివాసాల పై మూడ్రోజులుగా ఐటీ శాఖ అధికారులు సోదాలు చేపట్టిన సంగతి తెలిసిందే. గచ్చిబౌలిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న మంత్రి సబిత అనుచరుడైన ప్రదీప్ రెడ్డి నివాసంలో ఆదాయ పన్నుశాఖ అధికారులు సోదాలు చేశారు. ప్రదీప్‌రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు భారీగా డబ్బు స్వాధీనం చేసుకున్నారు. మహేశ్వరం ఎన్నికల కోసం సమకూర్చుకున్న డబ్బుగా ఐటీ శాఖ తేల్చింది.
ప్రదీప్ రెడ్డితో పాటు రెడ్డి ల్యాబ్స్ డైరెక్టర్ నరేందర్ రెడ్డి ఇంట్లో కూడా సోదాలు నిర్వహించారు. నరేందర్ రెడ్డి ఇంట్లో 7 కోట్ల 50 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. మంత్రి సబితా కుమారుడితో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లుగా ఐటీ అధికారులు తేల్చారు. ఫార్మా రంగానికి చెందిన పలువురి ఇళ్లు, కార్యాలయాల్లో ఉదయం నుంచి ఐటీ అధికారుల బృందాలు ఏకకాలంలో సోదాలు చేపట్టారు.
నగరంలో 15 వేర్వేరు ప్రాంతాల్లో ఏకకాలంలో సుమారుగా 10 ఐటీ అధికారుల బృందాలు ఈ సోదాల్లో పాల్గొన్నాయి. పన్ను ఎగవేత ఫిర్యాదుల పై వచ్చిన ఆర్థిక లావాదేవీల రికార్డులను ఐటీ అధికారులు తనిఖీ చేశారు. ఆర్‌సీపురంలోని నాగులపల్లి, అమీన్ పూర్ లోని పటేల్‌గూడ, గచ్చిబౌలిలో సోదాలు జరిగాయి. గచ్చిబౌలి ప్రాంతంలోని మై హోమ్ భూజా, అపార్ట్మెంట్లలోని ఫార్మా కంపెనీలకు చెందిన కొందరు ఉన్నతాధికారుల ఫ్లాట్లలో ఐటీ అధికారుల సోదాలు నిర్వహించారు.