Home > తెలంగాణ > Telangana Elections 2023 > KCR : గజ్వేల్‌లో 145, కామారెడ్డిలో 92.. కేసీఆర్కే పోటీ ఎక్కువ

KCR : గజ్వేల్‌లో 145, కామారెడ్డిలో 92.. కేసీఆర్కే పోటీ ఎక్కువ

KCR : గజ్వేల్‌లో 145, కామారెడ్డిలో 92.. కేసీఆర్కే పోటీ ఎక్కువ
X

తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల ప్రక్రియ మొన్ననే (నవంబర్ 10) ముగిసిపోయింది. అన్ని పార్టీల అభ్యర్థులు తమ నామినేషన్స్ నమోదు చేసుకున్నారు. రాష్ట్రంలోని మొత్తం 119 నియోజక వర్గాల్లో కలిపి 4,798 మంది అభ్యర్థులు నామినేషన్ వేశారు. చివరి రోజైన శుక్రవారం ఏకంగా 2,324 మంది అభ్యర్థులు నామినేషన్ వేశారు. కాగా సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న రెండు నియోజకవర్గాల్లోనూ ఎక్కువమంది అభ్యర్థులు నామినేషన్ వేశారు. గజ్వేల్ లో అత్యధికంగా 145, కామారెడ్డిలో 92 నామినేషన్లు వేశారు. ఆ తర్వాత ఎక్కువగా మేడ్చల్ 116, ఎల్బీనగర్ 77, మునుగోడు 74 నియోజకవర్గాల్లో నామినేషన్లు వచ్చాయి. అత్యల్పంగా నారాయణపేట 13, వైరా, ముక్తల్ సెగ్మెంట్ లో 19లో నామినేషన్లు దాఖలయ్యాయి. తమ సమస్యలకు నిరసనగా కేసీఆర్ పై పలువురు నామినేషన్ వేశారు. అలా వేసిన వారిలో రంగారెడ్డి జిల్లా వట్టివాగులపల్లిలోని శంకర్ హిల్స్ ప్లాట్ల బాధితులు కూడా ఉన్నారు. జగిత్యాలలో చెరకు రైతులు కూడా నామినేషన్ వేశారు. వీరితో పాటు నిరుద్యోగులు, అమరవీరుల కుటుంబాల తరపున కూడా నామినేషన్లు పడ్డాయి.

తెలంగాణలో మొత్తం 3,26,18,205 మంది ఓటర్లు ఉండగా.. అందులో 1,62,98,418 మంది పురుషులు, 1, 63,01,705 మంది మహిళలా ఓటర్లు ఉన్నట్లు ఈసీ ప్రకటించింది. థర్డ్ జెండర్ ఓటర్లు 2,676 మంది ఉన్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా మొత్తం15,406 మంది సర్వీస్ ఓటర్లు, 2,944 మంది ఓవర్సీస్ ఓటర్లు ఉన్నారు. తాజాగా జాబితా ప్రకారం రాష్ట్రంలో కొత్తగా ఓటర్లు 8.75 శాతం పెరిగారు. మొత్తం 35.73 లక్షల కొత్త ఓటర్లు నమోదయ్యాయి. 9.48 ఓటర్లను డిలీట్ చేశారు. ఇక పోస్టల్ బ్యాలెట్ కోసం 31,551 మంది నుంచి 12డీ ఫామ్స్ రిసీవ్ చేసుకున్నారు.




Updated : 12 Nov 2023 8:59 AM IST
Tags:    
Next Story
Share it
Top