Seethakka : బీఆర్ఎస్ నాపై కుట్రలకు పాల్పడింది : సీతక్క
X
బీఆర్ఎస్ నేతలు తనపై కుట్రలు, వ్యక్తిగత విమర్శలకు పాల్పడ్డారని.. వారికి ప్రజలే తగిన బుద్ధి చెప్తారని సీతక్క అన్నారు. కష్టకాలంలో ప్రజల వెంట ఉంటే అదంతా ప్రచారం కోసమే అన్నారని.. వారికి ఆడబిడ్డ ఉసురు తగులుతుందని చెప్పారు. కాంగ్రెస్ కార్యకర్తలను డబ్బుతో కొనుగోలు చేసి తనపై తప్పుడు ప్రచారం చేయించారని ఆరోపించారు. తనను ఎన్ని ఇబ్బందులకు గురిచేసిన తన ప్రజాసేవా మాత్రం ఆగదని స్పష్టం చేశారు. ములుగులో చిన్నపిల్లలు కూడా తనను అక్కున చేర్చుకున్నారని.. జీవితానికి ఇంకేం కావాలని అన్నారు.
తన గెలుపు కోసం కష్టపడ్డ వారిందరికీ సీతక్క థ్యాంక్స్ చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని.. ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి ఇంటా వెలుగులు వస్తాయన్నారు. ములుగు ప్రజలకు ఏ కష్టం వచ్చినా తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో రాహూల్ ప్రధాని అయ్యేలా కృషి చేస్తానని స్పష్టం చేశారు. మరోవైపు ఎన్నికల కౌంటింగ్ వేళ తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. ఎగ్జిట్ పోల్స్ అన్నీ కాంగ్రెస్ వైపే మొగ్గుచూపడంతో ఆ పార్టీ అప్రమత్తమైంది. అభ్యర్థులు చేజారకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటుంది. ఎన్నికల ఫలితాల మానిటరింగ్ బాధ్యతల్ని కాంగ్రెస్ అధిష్టానం కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్కు అప్పగించింది. గెలిచినా, హంగ్ లేదా తక్కువ మెజార్టీ వచ్చినా ఎమ్మెల్యేలు చేజారిపోకుండా క్యాంపుకు సన్నాహాలు చేస్తున్నారు