TS Assembly Elections 2023 : పార్టీలకు పట్టిరాని ఉచిత విద్య, వైద్యం.. మేనిఫెస్టోలో కనిపించని హామీలు
X
ప్రస్తుతం మద్య తరగతి కుటుంబానికి ఉన్న అతిపెద్ద సమస్య పిల్లల స్కూల్ ఫీజులు, హాస్పిటల్ ఖర్చులు. కార్పోరేట్ విద్యా, వైద్యం అంటూ పేదల జేబులు లూటీ చేస్తున్నారు. ఉన్న ఆస్తి, దాచుకున్న సేవింగ్స్ మొత్తం వీటికే అయిపోతున్నాయి. ఖర్చులు పెరిగి, సరిపోను ఆదాయం లేక సతమతం అవుతున్నారు. ఓ మంచి స్కూల్లో చదివించాలన్నా, మెరుగైన వైద్యం అందించాలన్నా సామాన్య ప్రజల అందనంత ఎత్తుకు వెళ్లిపోయాయి. అయితే ఎన్నికల్లో పేదల పక్షాణ నిలబడ్డాం.. వారి అభివృద్ధి, సంక్షేమానినకి తోర్పడతాం అంటున్న ఏ పార్టీ కూడా అందనంత ఎత్తుకు పెరిగిన స్కూల్ ఫీజులు, హాస్పిటల్ చార్జీలపై మాట్లాడటం లేదు. ఎంతసేపూ ఉచిత హామీలు, పించన్లపైనే రాజకీయాలు తిరుగుతున్నాయి. ప్రభుత్వ స్కూళ్లలో సౌతతులు మెరుగుపరుస్తామని, ప్రైవేట్ రంగంలో ఫీజులను నియంత్రిస్తామని ఏ పార్టీ చెప్పడం లేదు. ప్రభుత్వ వైద్య వ్యవస్తను బలోపేతం చేస్తామని, మెరుగైన ఉచిత వైద్యం అందింస్తామని ఏ పార్టీ ప్రకటించడం లేదు. పార్టీలు ఇప్పటివరకు విడుదల చేసిన మేనిఫెస్టోల్లో.. ఎందులోనే వీటి గురించి అసలు ప్రస్తావన లేదు. గత ఎన్నికల్లో కేజీ టు పీజీ అని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు.. ఈసారి వాటి ఊసే ఎత్తలేదు. దీన్నిబట్టి చూస్తుంటే నాయకులకు అసలు వీటిపై దృష్టి ఉన్నట్లు కనిపించడం లేదు.
ఎల్ కేజీ, యూకేజీకి కూడా రూ.30ల నుంచి మొదలై లక్ష వరకు వసూలు చేస్తున్నారు. చిన్న టెస్ట్ చేసుకోవాలన్నా హాస్పిటల్స్ వంక చూడ్డానికి భయపడే పరిస్థితి ఎదురయింది. అనవసర చార్జీలు వేసి జేబులు ఖాళీ చేస్తున్నారు. ఉచితంగా అందాల్సిన సేవలు ఇప్పుడు వ్యాపారంగా మారిపోయాయి. దాంతో మద్యతరగతి వాళ్లపై మోయలేని భారం పడుతోంది. ఇవన్నీ దాదాపుగా వ్యాపార, రాజకీయాల్లో ఉన్న ముఖ్య నేతల చేతుల్లోనే ఉండటం గమనార్హం. హాస్పిటల్స్ భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టినా.. ఆ స్కీం కింద వైద్యం చేయడానికి ఏ హాస్పిటల్స్ ఒప్పుకోవడం లేదు. దీంతో తప్పని పరిస్థితుల్లో వైద్యం చేయించుకుని అంతా అప్పుల పాలవుతున్నారు. ఉద్యోగులకు చికిత్స ఇవ్వడానికి కూడా హాస్పిటళ్లు నిరాకరిస్తున్నాయి. ఇన్ని బాధలు బరించలేక ఉద్యోగులు, పెన్షనర్లు ఈహెచ్ఎస్ స్కీమ్ లో మార్పుల కోసం పట్టుబట్టారు. చివరకు ఎన్నికల సమయంలో ఈ స్కీంలో మార్పులు చేసింది ప్రభుత్వం. అయితే ఆరోగ్యశ్రీలో మాత్రం మార్పులు చేయలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ. 10 లక్షల ఉచిత వైద్యం అని ప్రకటించగా.. బీఆర్ఎస్ పార్టీ రూ. 15లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని హామీ ఇచ్చింది. అయితే ఎక్కడా ఫీజుల నియంత్రణ అనే మాట తీసుకురాలేదు.