Home > తెలంగాణ > Telangana Elections 2023 > barrelakka : బర్రెలక్క డిపాజిట్ గోవింద! సోషల్ మీడియాను నమ్ముకున్నోళ్లు మటాష్!

barrelakka : బర్రెలక్క డిపాజిట్ గోవింద! సోషల్ మీడియాను నమ్ముకున్నోళ్లు మటాష్!

barrelakka : బర్రెలక్క డిపాజిట్ గోవింద! సోషల్ మీడియాను నమ్ముకున్నోళ్లు మటాష్!
X

తెలంగాణ ఎన్నికల్లో అన్ని పార్టీలూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం చేశాయి. అభ్యర్థులు సోషల్ మీడియాలో ప్రచారం కోసమే ప్రత్యేకంగా కోట్లు ఖర్చుపెట్టారు. వీడియోలు, పాటలు, స్లోగన్లు, పోస్టర్లు, మెసేజీలతో హోరెత్తించారు. ఓటర్లను ఆకట్టుకోవడానికి నానా పాట్లూ పడ్డారు. ‘గులాబీల జెండలే రామక్క గుర్తుల గుర్తించుకో రామక్క’ ‘కాంగ్రెస్ రావాలి’’ వంటి పాటలు స్లోగన్లు వైరల్ అయ్యాయి. అయితే ఫలితాల విషయంలో మాత్రం సోషల్ మీడియా ప్రభావం పెద్దగా కనిపించలేదు. ఫేస్ బుక్, ట్విటర్, యూట్యూబ్, వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్‌స్టాగ్రామ్ వంటి నానా వేదికల్లో అరివీర భయంకరంగా ప్రచారం చేసిన నాయకులకు చుక్కెదురురైంది.

ఈ ఎన్నికల ప్రచారం సెంటరాఫ్ అట్రాక్షన్ బర్రెలక్క. కొల్లాపూర్ నుంచి బరిలోకి దిగిన ఈ నిరుద్యోగినికి సోషల్ మీడియా పట్టం కట్టింది. యూట్యూబ్‌లో ఆమె వీడియోలకు లక్షలాది వ్యూస్ వచ్చాయి. చాలామంది స్వచ్ఛందంగా ఆమె వెంట తిరుగుతూ ప్రచార చేశారు. సొంత ఖర్చులతో కాన్వాయ్ కూడా ఏర్పాటు చేశారు. నిరుద్యోగుల ఆశాదీపం అని పాటలు కట్టారు. అంతేసి ప్రచారం చేసినా ఆమెకు డిపాజిట్ దక్కే పరిస్థితి కనిపించడం లేదు. ఆమెకు 15 వేల నుంచి 20 ఓట్లు పడతాయన్న అంచనాలు వచ్చాయి. అయితే 12.30 గంటల కౌంటింగ్ సమయానికి ఆమెకు 2657 ఓట్లు మాత్రమే దక్కాయి. కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు 36,619 ఓట్లతో ముందంజలో ఉండగా, బీఆర్ఎస్ అభ్యర్థి బీరం హర్షవర్ధన్ రెడ్డికి 23వేల పైచికులు ఓట్లు వచ్చాయి.

సోషల్ మీడియాను బాగా వాడుకున్న కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు కూడా ఫలితాల్లో వెనకబడ్డారు. కొందరు బొటాబొటి మెజారిటీతో సాగుతున్నారు. నాగార్జున సాగర్ బీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్, హుస్నాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి వొడితల సతీష్ కుమార్ వెనకబడ్డారు. బండి సంజయ్(కరీంనగర్), రఘునందన్ రావు (దుబ్బాక), జీవన్ రెడ్డి(ఆర్మూర్) తదితర అభ్యర్థులు కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసినా ఫలితం లేకపోయింది.


Updated : 3 Dec 2023 1:04 PM IST
Tags:    
Next Story
Share it
Top