TS Assembly Elections 2023 : ముగిసిన నామినేషన్ల పరిశీలన.. జానారెడ్డి నామినేషన్ తిరస్కరణ
X
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ముగిసింది. రాష్ట్రంలోని పలుచోట్ల పెద్దఎత్తున నామినేషన్లు దాఖలు కాగా.. పలువురి నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. నాగార్జున సాగర్ నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి నామినేషన్ వేయగా.. తిరస్కరణకు గురైంది. ఇక్కడి నుంచి ఆయన కొడుకు జైవీర్ రెడ్డి పోటీలో ఉన్నారు. జానారెడ్డి నామమాత్రంగా నామినేషన్ దాఖలు చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఎస్పీ అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణక గురయ్యాయి. స్టేషన్ ఘనపూర్, ఆలేరు, పాలకుర్తి, మధిర, భువనగిరి, బహదూర్ పుర, జనగామ సెగ్మెంట్లలో అభ్యర్థుల నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని 22నామినేషన్లు రాగా.. 7నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. పాలేరులో 58మంది నామినేషన్లు దాఖలు చేయగా.. 5 నామినేషన్లను అధికారులు రిజక్ట్ చేశారు. సత్తుపల్లిలో 41 నామినేషన్లు దాఖలు కాగా.. 6 నామినేషన్లను అధికారులు తిరస్కరించారు.
సూర్యాపేటలో 42మంది నామినేషన్లు దాఖలు చేయగా.. 10మంది నామినేషన్లను అధికారులు రిజక్ట్ చేశారు. కరీంనగర్లో 31మంది నామినేషన్లను ఆమోదించగా.. ఏడుగురి నామినేషన్లు తిరస్కరించారు. హజూరాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లో 13మంది నామినేషన్లు ఆమెదించగా.. ఏడుగురి నామినేషన్లు తిరస్కరించారు. నామినేషన్ల విత్ డ్రాకు ఈ నెల 15 వరకు గడువు ఉండగా.. బరిలో ఎవరెవరు ఉంటారో చూడాలి.