Home > తెలంగాణ > Telangana Elections 2023 > Revant reddy : రేవంత్ ప్రమాణానికి జాతీయ మీడియా ప్రాధాన్యం.. లైవ్ ఇచ్చేశారు..

Revant reddy : రేవంత్ ప్రమాణానికి జాతీయ మీడియా ప్రాధాన్యం.. లైవ్ ఇచ్చేశారు..

Revant reddy  : రేవంత్ ప్రమాణానికి జాతీయ మీడియా ప్రాధాన్యం.. లైవ్ ఇచ్చేశారు..
X

తెలంగాణ ముఖ్యమంత్రిగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి తెలుగు టీవీ చానళ్లతోపాటు జాతీయ మీడియా కూడా ప్రాధాన్యమిచ్చింది. పలు హిందీ, ఇంగ్లిష్ చానళ్లు ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశాయి. సాధారణంగా ఓ సీఎం ప్రమాణ స్వీకారానికి జాతీయ మీడియాలో లైవ్ ప్రసారం ఉండవు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల రాజకీయాలను హిందీ, ఇంగ్లిష్ చానళ్లు పెద్దగా పట్టించుకోవు. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీల ఎన్నికలు వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్‌గా భావించడం, దక్షిణ భారత రాష్ట్రాల్లో మరో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం, ఈ కార్యక్రమానికి సోనియా, రాహుల్, ఖర్గే వంటి అతిరథులు హాజరు కావడంతో జాతీయ మీడియా దృష్టి సారించింది. ఎన్డీటీవీ, ఇండియా టుడే, రిపబ్లిక్ టీవీ తదితర చానళ్లు ప్రమాణ స్వీకారాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశాయి. కొన్ని చానళ్లు రేవంత్ ప్రస్థానంపై ప్రత్యేక కార్యక్రమాలు, చర్చలు ప్రసారం చేశాయి. మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌లలో ముఖ్యమంత్రుల ఎంపికపై బీజేపీ ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోని నేపథ్యంలో తెలంగాణలో ప్రభుత్వం త్వరగా ఏర్పాటైంది.

Updated : 7 Dec 2023 1:45 PM IST
Tags:    
Next Story
Share it
Top