Palvai Sravanti : మునుగోడులో కాంగ్రెస్కు షాక్.. పాల్వాయి స్రవంతి కాంగ్రెస్కు రాజీనామా
X
కాంగ్రెస్ పార్టీకి దివంగత రాజ్యసభ సభ్యుడు పాల్వయి గోవర్ధన్‌రెడ్డి కుమార్తె, మునుగోడు కీలక నేత పాల్వాయి స్రవంతి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తే తన లేఖను.. సోనియా, రాహుల్ గాంధీలకు పంపారు. మునుగోడు టికెట్ రాకపోవడంతో మనస్తాపం చెందిన స్రవంతి.. ఈ నిర్ణయం తీసుకున్నారు. మునుగోడు టికెట్ తనకు కేటాయిస్తారని భావించగా.. తనను కాదని టికెట్ ను కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కేటాయించేసరికి పార్టీకి రాజీనామా చేశారు. గత కొన్ని రోజులుగా స్రవంతి రాజీనామా చేస్తుందని ప్రచారం జరగగా.. వాటిని ఆమె కొట్టిపడేశారు. కాగా ఇవాళ తానే స్వయంగా పార్టీకి రాజీనామా చేస్తున్నానని ప్రకటించేసరికి సర్వత్రా చర్చనీయాంశం అయింది. త్వరలో ఆమె గులాబీ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తుంది. ఇవాళ లేదా రేపు స్రవంతి.. మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు.
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.