Patel Ramesh Reddy : టికెట్ రాలేదని బోరున ఏడ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి
X
తెలంగాణ ఎన్నికల్లో భాగంగా అభ్యర్థుల తుది జాబితాను కాంగ్రెస్ పార్టీ గురువారం (నవంబర్ 9) విడుదల చేసింది. ఐదుగురు అభ్యర్థులతో తుది జాబితా విడుదలైంది. టికెట్ వస్తుందని చివరివరకు ఆశతో ఉన్న లీడర్లలో నిరాశే మిగిలింది. భంగపడ్డ వారిలో సూర్యాపేట కాంగ్రెస్ నేత పటేల్ రమేశ్ రెడ్డి కూడా ఉన్నారు. అతన్ని కాదని హైకమాండ్ రాంరెడ్డి దామోదర్ రెడ్డికి టికెట్ కేటాయించింది. ఈ క్రమంలో టికెట్ రాకపోవడంతో రమేష్ రెడ్డి బోరున విలపించారు. తన కుటుంబ సభ్యులను పట్టుకుని ఆయన కన్నీటిపర్యంతమయ్యారు. ఆయన ఫోన్ లో మాట్లాడుతూ.. కుటుంబ సభ్యులతో విలపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాగా ఇవాళ ఇండిపెండెంట్ గా నామినేషన్ వేస్తానని, తనకు టికెట్ దక్కకుండా చేసిందెవరో తర్వాత వెల్లడిస్తానని రమేశ్ రెడ్డి చెప్పారు.
సూర్యాపేట కాంగ్రెస్ టికెట్ దక్కకపోవడంతో భోరున ఏడ్చిన పటేల్ రమేష్ రెడ్డి మరియు ఆయన కుటుంబ సభ్యులు pic.twitter.com/KAif0KnXuX
— Telugu Scribe (@TeluguScribe) November 10, 2023