నేడు హైదరాబాద్కు మోదీ.. ఈ రూట్ బంద్
X
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రచారంకోసం మరోసారి రాష్ట్రానికి రానున్నారు. నేడు సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్లో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన మాదిగల విశ్వరూప మహాసభకు హాజరుకానున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో సాయంత్రం 4:45 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్ట్ కు చేరుకుంటారు. ఈ సభలో ఎస్సీ కులాల వర్గీకరణపై మోదీ కీలక ప్రకటన చేస్తారని తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల వేళ ఆ వర్గాలను ఆకట్టుకునేలా ప్రధాని ప్రకటనలు ఉంటాయని సమాచారం.
తెలంగాణలో ఎస్సీ జనాభాలో మాదిగ కులస్థులు 60శాతం ఉన్నారు. 20 నుంచి 25 నియోజకవర్గాల్లో వీరిదీ కీలక ఓటు బ్యాంక్. కాగా, ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 8 గంటల వరకు సంగీత్ ఎక్స్ రోడ్ నుంచి బేగంపేట రూట్లో ఆంక్షలు అమల్లో ఉంటాయి. కావున వాహనదారులు ప్రత్యామ్నాయ రూట్ చూసుకోవాలని పోలీసులు ప్రకటనలో సూచించారు.
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.