Home > తెలంగాణ > Telangana Elections 2023 > Pocharam Srinivas Reddy : స్పీకర్ సెంటిమెంట్కు బ్రేక్.. పోచారం సరికొత్త చరిత్ర

Pocharam Srinivas Reddy : స్పీకర్ సెంటిమెంట్కు బ్రేక్.. పోచారం సరికొత్త చరిత్ర

Pocharam Srinivas Reddy  : స్పీకర్ సెంటిమెంట్కు బ్రేక్.. పోచారం సరికొత్త చరిత్ర
X

తెలుగు రాష్ట్రాల్లో స్పీకర్ సెంటిమెంట్ కు బ్రేక్ పడింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నప్పటి నుంచి కూడా స్పీకర్‌గా పని చేసిన వారు ఇప్పటి వరకూ గెలిచిన పాపాన పోలేదు. తొలిసారిగా ఆ చరిత్రను తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తిరగరాశారు. బాన్సువాడ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ తరుపున పోటీ చేసిన పోచారం శ్రీనివాస్ రెడ్డి ఘన విజయం సాధించారు. కాగా ఈ గెలుపుతో పోచారం చరిత్రను తిరగ రాశారు. స్పీకర్ గా పనిచేసి వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేస్తే ఓడిపోతారన్న సెంటిమెంట్ ఉంది. ఆ సంప్రదాయాన్ని పోచారం శ్రీనివాస్ రెడ్డి బ్రేక్ చేశారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్పీకర్లుగా పనిచేసిన కావలి ప్రతిభా భారతి, సురేశ్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, నాదెండ్ల మనోహర్, రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో మధుసూదనాచారి, ఆంధ్రప్రదేశ్ లో కోడెల శివప్రసాద్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. కాగా కాంగ్రెస్ అభ్యర్థి ఏనుగు రవీందర్ రెడ్డిపై 23,582 ఓట్ల మెజార్టీతో విజయం సాధించి గత చరిత్రను తిరగరాశారు పోచారం.




Updated : 3 Dec 2023 10:11 AM GMT
Tags:    
Next Story
Share it
Top