Home > తెలంగాణ > Telangana Elections 2023 > Patnam Narender Reddy : పట్నం నరేందర్ రెడ్డిపై హత్యాయత్నం కేసు

Patnam Narender Reddy : పట్నం నరేందర్ రెడ్డిపై హత్యాయత్నం కేసు

Patnam Narender Reddy : పట్నం నరేందర్ రెడ్డిపై హత్యాయత్నం కేసు
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమీపించినవేళ కొడంగల్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదైంది. కాంగ్రెస్ కార్యకర్త కూర నరేశ్ పై దాడి కేసులో నరేందర్ రెడ్డి సహా మరో 8 మందిపై నారాయణపేట జిల్లా కోస్గి పోలీసులు కేసు నమోదు చేశారు. అందులో నరేందర్ రెడ్డిని ఏ-1గా చేర్చారు. తాను కాంగ్రెస్ పార్టీకి ఎందుకు మద్దతిస్తున్నావంటూ దూషిస్తూ.. కర్రలు, రాళ్లతో కొట్టారని, హత్యకు ప్రయత్నించారని బాధితుడు నరేశ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా నరేందర్ రెడ్డి సహా.. మరో కొందరు కలిసి ఈనెల 24న నరేష్ పై దాడి చేసినట్లు ఎఫ్ఐఆర్ లో తెలిపారు. తన ఫోన్‌, బైకు తాళంచెవి, 3 తులాల బంగారు గొలుసు, రూ. 20 వేల నగదు కూడా లాక్కున్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. కాగా కొడంగల్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రేవంత్ రెడ్డి పోటీచేస్తున్నారు. గత ఎన్నికల్లో రేవంత్ ను నరేందర్ ఓడించాడు.




Updated : 26 Nov 2023 1:21 PM IST
Tags:    
Next Story
Share it
Top