Home > తెలంగాణ > Telangana Elections 2023 > KCR : బీఆర్ఎస్లోకి పొన్నాల.. కండువా కప్పి ఆహ్వానించిన కేసీఆర్

KCR : బీఆర్ఎస్లోకి పొన్నాల.. కండువా కప్పి ఆహ్వానించిన కేసీఆర్

KCR : బీఆర్ఎస్లోకి పొన్నాల.. కండువా కప్పి ఆహ్వానించిన కేసీఆర్
X

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య బీఆర్ఎస్ పార్టీలో చేరారు. జనగామా జిల్లాలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ వేదికపై సీఎం కేసీఆర్ పొన్నాలకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.

బడుగు బలహీన వర్గాల ప్రజల సంక్షేమం కోసం కేసీఆర్ పనిచేస్తున్నారని పొన్నాల ప్రశంసించారు. నాలుగున్నర దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ సేవ చేసినా సరైన ప్రాధాన్యం లభించకపోగా అవమానించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో రాష్ట్రం పచ్చగా మారిందన్న ఆయన... ముఖ్యమంత్రి నాయకత్వంలో అభివృద్ధిలో దూసుకెళ్తున్నామని అన్నారు. సకల జనుల సర్వే పేరుతో సీఎం ఎప్పుడో కుల గణన చేపట్టారని చెప్పారు.




Updated : 16 Oct 2023 4:26 PM IST
Tags:    
Next Story
Share it
Top