Home > తెలంగాణ > Telangana Elections 2023 > Ponnam Prabhakar : మంత్రి వర్గ కూర్పుపై పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు

Ponnam Prabhakar : మంత్రి వర్గ కూర్పుపై పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు

Ponnam Prabhakar  : మంత్రి వర్గ కూర్పుపై పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు
X

కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ మంత్రివర్గ కూర్పుపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను సీనియర్ నాయకుడిని అని.. మంత్రివర్గంలో తప్పకుండా స్థానం లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అధిష్టానం తనను గుర్తిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్లో ఏ నిర్ణయమైన సమిష్టిగా తీసుకుంటామని తెలిపారు. కొత్త, పాతవారిని కలుపుకుని ముందుకు పోవాల్సి ఉంటుందన్నారు. క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ కార్యకర్తగా తెలంగాణ కోసం పోరాడినట్లు చెప్పారు. ప్రగతి భవన్కు జ్యోతి బాపూలే ప్రజా భవన్ పేరు పెట్టాలని సీఎంను కోరతామన్నారు. బీఆర్ఎస్లో ప్రజాసౌమ్యం లేదని.. ఆ పార్టీలో బీసీ, దళిత వ్యక్తులను సీఎం చేయగలరా అని ప్రశ్నించారు. కాంగ్రెస్కు బీఆర్ఎస్కు అసలు పోలిక లేదని విమర్శించారు.

కాగా తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి రేపు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఎల్బీ స్టేడియంలో మధ్యాహ్నం 1.04 నిమిషాలకు గవర్నర్ తమిళిసై ఆయనతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ పెద్దలు సహా పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్‌, ప్రియాంకలను రేవంత్‌ రెడ్డి ఢిల్లీ వెళ్లి స్వయంగా ఆహ్వానించారు. మరికొందరి ప్రముఖులకు ఆహ్వానాలు పంపారు.


Updated : 6 Dec 2023 1:50 PM IST
Tags:    
Next Story
Share it
Top