Home > తెలంగాణ > Telangana Elections 2023 > Prashant Kishor : కాంగ్రెస్కు అభినందనలు చెప్పిన ప్రశాంత్ కిషోర్!

Prashant Kishor : కాంగ్రెస్కు అభినందనలు చెప్పిన ప్రశాంత్ కిషోర్!

Prashant Kishor : కాంగ్రెస్కు అభినందనలు చెప్పిన ప్రశాంత్ కిషోర్!
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. నెల రోజులుగా చేసిన హోరాహోరీ ప్రచారానికి తీర్పు.. అభ్యర్థుల భవిష్యత్తు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. ప్రస్తుతం ఎగ్జిట్ పోల్స్ ఫలితాల హవా నడుస్తుంది. ఏ సర్వే ఏ రిపోర్ట్ ఇస్తుందని పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. అయితే ప్రస్తుతం వచ్చిన ప్రముఖ ఎగ్జిట్ పోల్స్ సర్వే ప్రకారం.. కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడుతుందని తేలింది. సగానికి పైగా సర్వేలన్నీ కాంగ్రెస్ పార్టీకే పట్టంకడుతున్నాయి. కొన్ని మాత్రం బీఆర్ఎస్ ప్రభుత్వం గెలుస్తుందని చెప్తున్నాయి.

తెలంగాణలో విజయం సాధిస్తామని, రాష్ట్రంలో ఈసారి ఏర్పడేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ఎన్నికల స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ కాల్ చేసి మాట్లాడారని, ఎన్నికల్లో గెలిచినందుకు కంగ్రాచ్యులేషన్స్ చెప్పినట్లు ప్రచారం జరుగుతుంది. ప్రశాంత్ కిషోర్ తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమి ఖాయమైనదని గతంలోనే చెప్పినట్టుగా వార్తలు వచ్చాయి. తాజాగా మరోసారి బీఆర్ఎస్ ఓటమి ఖాయమని ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేసినట్లు తెలుస్తుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 74పైగా సీట్లు గెలిచి అఖండ విజయం సాధిస్తున్నందుకు అభినందనలు చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.




Updated : 30 Nov 2023 3:01 PM GMT
Tags:    
Next Story
Share it
Top