Home > తెలంగాణ > Telangana Elections 2023 > Raj bhavan : సాయంత్రం సీఎం ప్రమాణస్వీకారం.. రాజ్ భవన్లో ఏర్పాట్లు

Raj bhavan : సాయంత్రం సీఎం ప్రమాణస్వీకారం.. రాజ్ భవన్లో ఏర్పాట్లు

Raj bhavan : సాయంత్రం సీఎం ప్రమాణస్వీకారం.. రాజ్ భవన్లో ఏర్పాట్లు
X

అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. సీఎల్పీ భేటీలో నేతలు సీఎంను ఎన్నుకోనున్నారు. ముఖ్యమంత్రి పేరు ఖరారైన వెంటనే సీఎల్పీ నేతలు నేరుగా రాజ్ భవన్ వెళ్లనున్నారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరనున్నారు. గవర్నర్ ఆమోదం మేరకు కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

సోమవారం సాయంత్రం కొత్త సీఎం పగ్గాలు చేపట్టనున్నారు. రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం ఉండనుంది. గవర్నర్ తమిళిసై కొత్త సీఎంతో ప్రమాణం చేయించనున్నారు. ప్రమాణస్వీకారోత్సవం కోసం ఇప్పటికే రాజ్ భవన్ ముస్తాబవుతోంది. ఈ వేడుక కోసం అవసరమైన ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. అతిధుల కోసం కుర్చీలు, టెంట్లు రాజ్ భవన్కు ఇప్పటికే తరలించారు. సాయంత్రం 5 గంటలకు ప్రమాణ స్వీకారం జరగనుంది.




Updated : 4 Dec 2023 7:10 AM GMT
Tags:    
Next Story
Share it
Top