Home > తెలంగాణ > Telangana Elections 2023 > MODI : హుజూరాబాద్ ట్రైలర్ మాత్రమే, ఇప్పుడు సినిమా చూపిస్తారు.. మోదీ..

MODI : హుజూరాబాద్ ట్రైలర్ మాత్రమే, ఇప్పుడు సినిమా చూపిస్తారు.. మోదీ..

MODI : హుజూరాబాద్ ట్రైలర్ మాత్రమే, ఇప్పుడు సినిమా చూపిస్తారు.. మోదీ..
X

తెలంగాణలో మార్పు గాలి వీస్తోందని, వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రాష్ట్ర ప్రజలను మోసం చేశాయని, వాటిని నమ్ముకుంటే అధోగతేనని అన్నారు. ఆయన సోమవారం మహబూబాబాద్‌, కరీంనగర్‌లలో నిర్వహించిన బీజేపీ సకల జనుల విజయ సంకల్ప సభలో పాల్గొని ప్రసంగించారు. వచ్చే ఐదేళ్లు తెలంగాణ భవిష్యత్తు కీలకమని, ప్రజలు తమకు మేలు చేసే పార్టీనే గెలిపించాలని కోరారు. ‘‘పదేళ్ల బిడ్డ తల్లిదండ్రులు అతని భవిష్యత్‌ కోసం ఎంతో ఆలోచిస్తారు. తెలంగాణకు కూడా వచ్చే ఐదేళ్లు ఎంతో ముఖ్యం. బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రతిష్ట మరింత పెరుగుతుంది..’’అని అన్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని మోదీ ఆరోపించారు. ‘‘మేం గెలిస్తే అవినీతికి పాల్పడిన బీఆర్ఎస్ నేతలను జైలుకు పంపుతాం. కాంగ్రెస్‌, బీజేపీలు తెలంగాణను సర్వనాశనం చేశాయి. కేసీఆర్ కోరిన కోరికను మేం నెరవేర్చలేదనే ఆయన మమ్మల్ని దూషిస్తున్నారు. ఆయన గతంలో ఢిల్లీకి వచ్చి మమ్మల్ని కలిసి బీజేపీ చేతులు కలుపుతామని, తన కొడుకును సీఎంను చేయాలని కోరారు. మేం అందుకు ఒప్పుకోకపోవడంతో తిట్లు మొదలుపెట్టారు’’ అని మోదీ మండిపడ్డారు.

కేసీఆర్‌కు మూఢనమ్మకాలు ఎక్కువని ప్రధాని ఆరోపించారు. ‘‘కేసీఆర్ లక్షల కోట్లు దోచుకున్నారు. మూఢ నమ్మకాలతోనే సచివాలయాన్ని కూల్చారు. వందల కోట్లు ప్రజాధనాన్ని వృథా చేశారు. మనకు ఇలాంటి ముఖ్యమంత్రి అవసరమా? తెలంగాణ ప్రజలు ఆయన బుద్ధి చెబుతారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో ఆయనకు ట్రైలర్‌ చూపించారు. నేటి ఎన్నికల్లో పూర్తి సినిమా చూపిస్తారు..’’ అని అన్నారు.




Updated : 27 Nov 2023 11:30 AM GMT
Tags:    
Next Story
Share it
Top