TS Assembly Elections 2023 : ప్రజల ఆశలు, ఆశయాలు నెరవేరాలంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రావాలి: ప్రియాంక గాంధీ
X
తెలంగాణ వీరుల భూమి. స్వరాష్ట్రం అమరవీరుల ఆకాంక్ష. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతో మంది బలిదానాలు చేశారని అన్నారు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ. మంచి భవిష్యత్తు కోసం తెలంగాణను కోరుకుని సాధించారని చెప్పారు. ములుగులో ఏర్పాటుచేసిన కాంగ్రెస్ విజయ భేరీ యాత్రలో పాల్గొన్న ప్రియాంక.. సోనియా గాంధీ దురదృష్టితో, ఎలాంటి రాజకీయ లబ్ధి కోసం ఆలోచించకుండా తెలంగాణ ఇచ్చారని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా ప్రజల ఆకాంక్షలు, సంక్షేమానికే విలువ ఇచ్చిందని ప్రియాంక గాంధీ అన్నారు. సోనియా గాంధీ రాజకీయ మూల్యం చెల్లించి మరీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని చెప్పారు. సోనియా గాంధీ దురదృష్టితో, ఎలాంటి రాజకీయ లబ్ధి కోసం ఆలోచించకుండా తెలంగాణ ఇచ్చారని చెప్పారు. స్వరాష్ట్రంలో ప్రజల ఆశలు, ఆశయాలు నెరవేరాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని తెలిపారు.
కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో.. రైతుల జీవితం బాగుపడుతుందని, ఉద్యోగావకాశాలు వస్తాయని ఆశించారు. కానీ, వాటిని బీఆర్ఎస్ పార్టీ నెరవేరకుండా చేసిందని ఆరోపించారు ప్రియాంక. మీ ఆశలు, ఆశయాలు నెరవేరాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలరి కోరారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. తెలంగాణలో సామాజిక న్యాయం దొరుకుతుందని, యువత ఆత్మహత్యలు ఆగుతాయని అన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలతో ఎన్నికలకు వస్తుందని, అధికారంలోకి రాగానే వాటిని తప్పక అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఇతర రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని అమలు చేసి చూపించామన్నారు ప్రియాంక.
తెలంగాణలో 40వేల మందికి పైగా నిరుద్యోగులు ఉన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అన్ని ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. రైతులకు రెండు లక్షల రూపాయల రూణమాఫీ చేస్తామని తెలిపారు. పంటకు కనీస మద్దతు ధర చెల్లిస్తామని చెప్పారు. ప్రతి ఎకారకు ఏడాది రూ.15 వేలు ఇస్తామని, భూమి లేని రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తామని తెలిపారు. వరికి రూ. 2500, మొక్కజొన్నకు రూ. 2200 మద్దతు ధర ఉంటుంది అన్నారు. రూ. 500 లకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని, మహాలక్ష్మీ పథకం కింద మహిళలకు నెలకు రూ.2500 ఇస్తామని హామీ ఇచ్చారు.