Rahul Gandhi : జోరు పెంచిన రాహుల్, ప్రియాంక.. నేడు 7 నియోజకవర్గాల్లో ప్రచారం
X
మరో 5 రోజుల్లో ఎన్నికలు సమరం జరగనుండగా.. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం జోరు పెంచింది. అగ్రనేతలంతా ఒక్కొక్కరిగా రాష్ట్రానికి క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇవాళ తెలంగాణలో పర్యటించనున్నారు. బోధన్, ఆదిలాబాద్, వేములవాడ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. నాందేడ్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో ఉదయం 11: 30 గంటలకు బోధన్ చేరుకుని సభలో పాల్గొంటారు. 1.30 గంటలకు ఆదిలాబాద్ పబ్లిక్ మీటింగ్, సాయంత్రం 3.30 గంటలకు వేములవాడలో బహిరంగసభల్లో పాల్గొంటారు.
ఆయా నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన సభల్లో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం హెలికాప్టర్ లో బేంగపేటకు చేరుకుంటారు. రేపు అందోల్, సంగారెడ్డి, కామారెడ్డి ప్రచార సభలకు హాజరుకానున్నారు. ఇప్పటికే ప్రియాంక గాంధీ రాష్ట్రంలో పర్యటన మొదలుపెట్టింది. శుక్రవారం మధ్యాహ్నం పాలకుర్తి, హుస్నాబాద్, కొత్తగూడెం నియోజకవర్గాల్లో జరిగిన సభల్లో పాల్గొన్నారు ప్రియాంక. ఇవాళ ఖమ్మం, పాలేరు, సత్తుపల్లి, మధిర నియోజకవర్గాల్లో ఏర్పాటుచేసిన సభలకు హాజరవుతారు. అక్కడి నుంచి విజయవాడకు వెళ్లి గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీ వెళ్తారని గాంధీభవన్ వర్గాలు తెలిపాయి.